ANDHRA PRADESH CRIME NEWS DOUBLE MURDER CASE UPDATE 2 SUSPECTED ARRESTED BY POLICE IN PRAKASAM DISTRICT NGS
Double Murder Case: గొంతుకోసే నరహంతకులు గుర్తింపు.. ప్రకాశం జిల్లా జంట హత్యల కేసు మిస్టరీ వీడేనా
జంట హత్య కేసు నిందితుల గుర్తింపు..!
Double Murder Case: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను గొంతు కోసి హత్య చేసే నరహంతకులు భయపెడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాల్లో వరుసగా ఈ జంట హత్యలు కలకలం రేపాయి. తాజాగా ఓ జంట హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు.. నిందితులను గుర్తించారు..
Double Murder Case Update: కొన్ని హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కరుడుగట్టిన నేరగాళ్లు నరహంతకులుగా మారి.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా (Prakasam District)ల్లో పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు జంట హత్యల కేసు పోలీసులకు ఛాలెంజ్ గా మారాయి. గత ఏడాది నవంబర్ 20 వతేదిన ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే డిసెంబర్ 3వ తేదీన టంగుటూరులో తల్లీ, కూతుళ్ళను అత్యంత దారుణంగా గొంతుకోసం హత్య చేశారు దుండగులు. అనంతరం ఒంటిపై బంగారు నగలతో ఉడాయించారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు పూసపాడు వృద్ద దంపతుల హత్య కేసు మిస్టరీ వీడకుండానే అదే తరహాలో టంగుటూరులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో తల్లీకూతుళ్ళు హత్యకు గురవడంతో పోలీసులు ఈ రెండు కేసులను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రెండు కేసులకు ఏదైనా లింక్ ఉందా..? అన్న కోణంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. అయితే టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. నిందితులిద్దరూ కందూకూరుకు చెందిన శివకోటయ్య, జరుగుమల్లికి చెందిన కిషోర్ గా అనుమానించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 3వ తేదీ శనివారం రాత్రి టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య 43 ఏళ్ల శ్రీదేవి, కుమార్తె 21 ఏళ్ల వెంకట లేఖన లను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదు. కుమార్తెకు ఫోన్ చేయగా కుమార్తె ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖనలు గొంతు కోసిన స్ధితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. రవికిషోర్ ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారి ద్వారా సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ళ హత్యలు దొంగలు చేసినవిగానే భావిస్తున్నారు పోలీసులు. ఆ దిశగా విచారణ చేస్తుండగా.. ఈ ఇద్దరు అనుమానితులను గుర్తించారు. తల్లీ కూతుళ్లను హత్య చేసింది వీరే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.. అయితే ఎందుకు చంపారు.. కేవలం బంగారం చోరీ కేసమే హత్య చేశారు. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. అలాగే గతంలో ప్రకాశం జిల్లాలో జరిగిన జంట హత్యలతో వీరికి ఏమైనా సంబంధం ఉందా.. ఇంకా ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు.. వీరితో పాటు ఈ గ్యాంగ్ లో ఎవరైనా ఉన్నారా.. ఇలా అన్ని కోణాలను పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.