Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS CYBER CHEATING IN KAKINADA ONE WOMEN FORGET WHATASAPP WEB LOGOUT NGS

Whatsapp web: వాట్సాప్ వెబ్ ఆన్ చేసి.. లాగౌట్ అవ్వడం మరిచిపోయారా.? బీ కేర్ ఫుల్.. ఓ మహిళకు ఏం జరిగిందంటే?

వాట్సప్ వెబ్ లాగ్ ఔట్ అవ్వడం మరిచిపోయారా..?

వాట్సప్ వెబ్ లాగ్ ఔట్ అవ్వడం మరిచిపోయారా..?

Whatapp web: ఒక్కో సారి చేసిన చిన్న పొరపాట్లు భారీ ముల్యం చెల్లించుకునేలా చేస్తాయి. తెలిసిన చేసినా.. పొరపాటున చేసిన పని కూడా బాధ పడకతప్పదు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్నేహితల ల్యాప్ టాప్ ల్లో.. నెట్ సెంటర్లలో చాలామంది వట్పప్ వెబ్ తో లాగిన్ అవుతున్నారు. అయితే అలా లాగిన్ అయిన తరువాత లాగౌట్ చేయడం మరిపోయారా అంతే సంగతి..

ఇంకా చదవండి ...
  Whats app web logout:  ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart phone) కామన్ అయ్యింది. అందులో వాట్సప్  (Whats app)లేని ఫోన్ ఏది ఉండదు.. ప్రస్తుతం ఎక్కుమంది వాట్సప్ లేని జీవితం లేదు అనే స్థాయిలో ఉన్నారు. అన్నింటికీ వాట్సప్ నే వాడేస్తున్నారు. కేవలం మొబైలోనే కాదు.. నెట్ సెంటర్ లేదా.. ల్యాప్ టాప్ (laptop), డెస్కెటాప్ (Desktop) కంప్యూటర్ల పై వాట్సప్ వెబ్ లాగిన్ (Whatsapp login) అవుతున్న సందర్భాల్లో చాలానే ఉన్నాయి. అయితే వాట్సప్ వెబ్ లాగిన్ అయిన తరువాత.. లాగౌట్ మరిచిపోతే ప్రమాదం తప్పదు.. తాజాగా జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.. వేరేవారి బ్యాంకు ఖాతాలనుంచి ఆధునిక టెక్నాలజీ సాయంతో డబ్బు దోచుకున్న ఓ సైబర్‌ నేరగాడిని కడప జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి..అతడి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు రికవరీ చేశారు.

  జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఎర్రగుంట్లలోని సుందరయ్య నగర్‌కు చెందిన 31 ఏళ్ల మల్లెపోగు ప్రసాద్‌ ప్రొద్దుటూరు టౌన్‌ హోమస్‌పేటలో తమ బంధువులకు చెందిన ధనలక్ష్మి వెబ్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సరిగ్గా ఆరు నెలల క్రితం అరుణ అనే మహిళ ఆ నెట్‌ సెంటర్‌లో తన వాట్సాప్‌ వెబ్‌లో లాగిన్‌ అయి డాక్యుమెంట్లు ప్రింట్‌ తీసుకుని లాగౌట్‌ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో నిందితుడు వాట్సాప్‌ను చెక్‌చేయగా ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఎవరికో డబ్బులను పంపిన విషయం గమనించాడు. వెంటనే అరుణ కుమార్తె నంబరుకు ఫోన్‌ చేసి మీ తల్లి ఆధార్, పాన్‌తో లింక్‌ కాలేదని, తాను చెప్పినట్లు మెసేజ్‌ పెట్టమని కోరాడు. తరువాత ఆమె సెల్‌కు వచ్చిన మెసేజ్, వెరిఫికేషన్‌ కోడ్‌లను స్క్రీన్‌షాట్‌గా తెప్పించుకున్నాడు. తరువాత అరుణ వాడుతున్న నంబరును ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు పోర్టబుల్ చేసి హైదరాబాద్‌లో సిమ్‌కార్డును తీసుకుని యాక్టివేట్‌ చేసుకున్నాడు.

  ఇదీ చదవండి : స్కూల్స్ పై కరోనా పంజా.. 10 శాతంపైగా కేసులు అక్కడే..

  తను దొరకుండా ఉండేందుకు నిందితుడు తెలివితేలు ప్రదర్శించారు. కానీ తన ఫేస్‌కట్‌తోనే పోలి ఉన్న రాయచోటికి చెందిన మగ్దూం బాషా అనే అతని ఆధార్‌కార్డును వాడుకున్నాడు. ఈ నంబరు సిమ్‌ను తన సెల్‌లో వేసుకుని ఫోన్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని అరుణకు చెందిన కెనరాబ్యాంక్‌ ఖాతానుంచి మొత్తం 4.31 లక్షలను కాజేశాడు.

  ఇదీ చదవండి : మానవబాంబుగా మారి సీఎంను చంపుతానంటూ హల్ చల్.. యువకుడి అరెస్ట్ పై జనసేన క్లారిటీ ఇదే

  అయితే తన బ్యాంకు ఖాతా నుంచి 4 లక్షలకు పైగా డబ్బు మాయం కావడంతో ఆందోళనకు గురైన అరుణ.. .. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, కడప సైబర్‌ సెల్‌ పోలీసు బృందం అధునాతన టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితుడు తాను దొంగిలించిన మొత్తంలో 3.10 లక్షలు తన తల్లి ఆరోగ్య సమస్య తీరడానికి హోమం చేయాలంటూ కర్నూలు జిల్లా కొలిమికుంట్లకు చెందిన ఓ పూజారికి ఇచ్చినట్లు తెలిపాడు. నిందితుడిని అక్కడికి తీసుకుపోయిన పోలీసులు పూజారి నుంచి ఆ 3 లక్షలు రికవరీ చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Kadapa

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు