హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Occult Worshiping: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని పోలీసులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు..? ఏం చేశారంటే?

Occult Worshiping: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని పోలీసులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు..? ఏం చేశారంటే?

Occult Worshiping: రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఎవరైనా ఏం చేస్తారు.. ట్రాఫిక్ రూల్స్ ను పక్కా అమలు చేస్తారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రమాదం అనుకున్న ప్రాంతాలను గుర్తించి.. హచ్చరికల బోర్డులు జారీ చేస్తారు.. కానీ ఈ పోలీసులు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. రోడ్డు ప్రమాదాలు తగ్గాలి అంటూ వారు చేసిన పని వివాదాస్పదం అవుతోంది.

ఇంకా చదవండి ...

  Worshiping Occult in Police Station: ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎన్ని కఠిన నిబంధనలు చేపడుతున్నా.. ప్రమాదాలు తగ్గడం లేదు.. అయితే ఇందులో మానవ తప్పిదాలు.. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు ఎక్కువగా కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అతివేగమే ఈ ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్.. నిద్రలేమితో ఇబ్బంది పడుతూ వాహనం నడపడం.. నిబంధనలు పాటించకుండా డ్రైవిండ్ చేయడం.. ఇలాంటి కారణాలే అత్యధిక ప్రమాదాలకు కారణం. దీనికితోడు అధికాుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమే.. ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో.. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం కూడా ఈ ప్రమాదాలకు ఒక కారణం. అయితే ఇలాంటి ప్రమాదాలను నిరోధించడానికి ఏం చేయాలి.. నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.. వాహనదారుల్లో అవగాహన కల్పించాలి. డేంజర్ జోన్ లను గుర్తించి.. బోర్డులు పెట్టాలి.. కానీ ప్రకాశం జిల్లా (Prakasham District) పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఏం చేశారో తెలుసా..? షాక్ అవుతారు..

  సాధారణంగా జంతు బలులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యం పరచాల్సిన బాధ్యత పోలీసులదే.. ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే.. మూఢ నమ్మకాలను ఫాలో అయ్యారు. ప్రకాశం జిల్లాలోని బల్లికురవ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన తంతు వివాదాస్పదం అవుతోంది. నమ్మకం ఉండాలి… అది మూఢనమ్మకం కాకూడదు.. అందులోను ప్రభుత్వ కార్యాలయాల్లో మూఢ నమ్మకాలు, జంతుబలులతో పూజలు చేయడం సంచలనంగా మారింది. ఇటీవలి కాలంలో బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ప్రమాదాల నివారణ కోసం తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన పోలీసులు.. మూఢ నమ్మకాలను ఆశ్రయించారు. నల్లకోడిని బలిచ్చి పోలీస్‌స్టేషన్‌లో పూజా కార్యక్రమాలు చేయడం స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

  ఇదీ చదవండి : తిరుమలలో అంజనాద్రి వైభవానికి సర్వం సిద్ధం.. టీటీడీ వద్ద ఉన్న అధారాలు ఏంటి..?

  అంతేకాదు అలా నల్లకోడిని బలిచ్చి పోలీసులు ఆగిపోలేదు. ఆ కోడి రక్తాన్ని గోడలపై ముద్రలుగా వేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం నింపాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం ఏంటని హేతువాద సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు.. బల్లికురవ పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి.

  ఇదీ చదవండి : విశాఖ ఉక్కు ఉద్యమానికి ఏడాది పూర్తి.. నిరసనలు ఉధృతం.. సంఘీభావం తెలిపిన నారాయణమూర్తి

  ఇందులో మరో ట్విస్టు కూడా ఉంది. పోలీస్‌ స్టేషన్‌లో బలిచ్చిన నల్లకోడి.. ఇటీవల కోడిపందాల దాడుల్లో పట్టుబడినది చెప్తున్నారు. ఇది మరో చర్చగా మారింది. స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో బల్లికురువ ఎస్సై అప్రమత్తమయ్యారు. తన స్టేషన్‌లో తనకు తెలీకుండా ఇదంతా జరిగిందని ఆయన వివరణ ఇస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cock fight, Prakasham dist

  ఉత్తమ కథలు