ANDHRA PRADESH CRIME NEWS CHITOOR SP NEW THOUGHT HE WANT CHANGE ROWDY SHEETERS NGS TPT
Andhra Pradesh: వారిలో మార్పు కోసం ఎస్పీ నూతన ప్రయోగం.. షాక్ తిన్న రౌడీషీటర్లు
ఎస్పీ నూతన ప్రయోగం
Andhra Pradesh: రౌడీలను డీల్ చేయడంలో.. వారిని మార్చే ప్రయత్నంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు భయపెట్టి చేస్తారు.. కొందరు మంచి మాటలు చెప్పి ప్రయత్నం చేస్తారు.. ఆయన చేసిన పనికి రౌడీషీటర్లంతా షాక్ అయ్యారు.
GT Hemanth Kumar, Tirupathi, News18. Andhra Pradesh: నేరస్థులను., రౌడీ షీటర్లను మంచి వారుగా మార్చడానికి ఒక్కో అధికారికి ఒక్కో స్టైల్ ఉంటుంది. దౌర్జన్యం, గూండాయిజాన్ని రూపు మాపెందుకు.. కానిస్టేబుల్స్ నుంచి పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ల వరకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. దండించి మంచి మార్గంలోకి కొంత మేరకు మాత్రమే తీసుకు రాగలమని., వారిని అనుకున్న మార్గంలోకి తెచ్చుకోవాలి అంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని.. అయితే కేవలం బెదిరింపులు మాత్రమే సరిపోవు అప్పుడప్పుడు బుజ్జగింపు ద్వారా కూడా దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ ఒక్కొక్కరు ఒక్కే స్టైల్లో వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తారు. తమ ప్రయత్నం ద్వారా వారిలో మార్పు రావాలని కోరుకుంటారు. ఎంతటి కరుడుగట్టిన వారినైనా మార్పించవచ్చని నమ్మారు ఓ ఐపీఎస్ అధికారి.
అయితే అందరిలా కాకుండా... రౌడీ షీటర్లను., పాత నేరస్థులను ప్రేమగా చూసి.. నేర ప్రవృత్తి వదులుకోవాలని సూచించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు చేసిన ఆ వింత ప్రయోగం ఏంటి...? నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?
సమాజంలో ప్రతినిత్యం జరిగే నేరాలు., దాడులకు సంబంధించిన పాత నేరస్థులను వివిధ సంబార్భాల్లో.. ఎన్నికల సమయంలోను స్టేషన్ కు పిలిచి హెచ్చరించి పంపుతారు పోలీసులు. ఒక్కసారి స్టేషన్ నుంచి పిలుపు రాగానే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందా అని టెన్షన్ పడిపోతుంటారు. ప్రత్యేక రోజులు., ధర్నా వంటి కార్యక్రమాలు అంటే....ముందుగా అరెస్ట్ అయ్యేది కూడా వీరే. అలానే 2021 ఏడాది చివరి రోజున ప్రతి ఒక్క రౌడీ షీటర్ మొబైల్ కు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ లు రావడంతో అంతా టెన్షన్ పడ్డారు.
ఈ సారి ఏమైపోతుందో దేవుడా అంటూ ప్రతి ఒక్క రౌడీ షీటర్ భయంతో స్టేషన్ మెట్లు ఎక్కారు. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది కొంత భిన్నమైన వాతావరణం పోలిస్ స్టేషన్ లో ఎదుర్కొన్నారు రౌడీ షీటర్లు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఐపిఎస్ తీసుకున్న వినూత్న నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణం.
నూతన సంవత్సరం సందర్భంగా తిరుపతి ఎస్పి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు రౌడీషీటర్లతో,పాత నేరస్తులతో కేక్ కట్ చేయించారు. ఇకపై ఎటువంటి నేరాలకు చేయం అని వారి చేత ప్రమాణాలు చేయించారు.. ప్రతి రౌడీషీటర్ కు ఎస్పీ తరఫున గ్రీటింగ్ కార్డులను సైతం అధికారులు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు..
నూతన సంవత్సరంలో నేరాలు లేని జీవితంలోకి అడుగు అడుగు పెడుతూ గౌరవప్రధంగా, బాధ్యతా యుతంగా ఉండాలని ఎస్పి వెంకట్ అప్పలనాయుడు గ్రీటింగ్ కార్డులో రౌడీషీటర్లకు సూచించారు. నేరరహిత సమాజం కోసం కృషి చేస్తున్న పోలీసులకు తాము కూడా సహకరిస్తాం అంటూ పాత నేరస్తులు హామీ ఇచ్చారట..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.