Youth Bike Stunt: పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల అల్లరి ఆగడం లేదు. ముఖ్యంగా చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. తామే హీరోలం అన్నట్టు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడ నగరంలో బైక్ రేసర్లు చేస్తున్న హల్ చల్ వైరల్ గా మారింది. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. స్టంట్లు చేస్తూ భయపెడుతున్నారు.
Dangerours Bike Stunts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కుర్రకారు దూకుడుతో ఇతరులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా కొందరు పోకిరీ బ్యాచ్ రేసింగ్ పేరుతో ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇటీవల బైక్ స్టంట్ల (Bike Stunts)ద్వారా కొందరు ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఇతర ప్రాణాలు తీస్తున్నారు. అయినా కొందరి యువతో మార్పు రావడం లేదు. తాజాగా విజయవాడ నగరం (Vijayawada)లో బైక్ రేసర్లు (Bike racers) రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై (Durga Gudi Flyover) రయ్‌మంటూ దూసుకెళ్తూ వాహనదారులకు దడపుట్టించారు. స్టంట్లు చేస్తూ అటు వెళ్లాలి అనుకునేవారిని భయపెడుతున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు.. ఇప్పుడు నగరంలోని ప్రధానరహదారులపై నిర్వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అక్కడికే వారి దూకుడు పరిమితం కాలేదు.. ఇప్పుడు దుర్గగుడి ఫ్లఓవర్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకున్నారు. ఆ వీడియో బయటకు వచ్చాయి.
నిత్యం రద్దీగా మారుతున్న విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌లో కొందరి యువకులు బైకు స్టంట్లు అందర్నీ భయపడేలా చేస్తున్నాయి. అటుగా వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నారు. రయ్..రయ్ మంటూ దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేస్తున్నారు. ఇంతలా హల్ చల్ చేస్తున్నా.. కనీసం పోలీసులకు కూడా చిక్కడం లేదు.
సీసీ కెమెరాల్లో పట్టుకుందామని అనుకుంటే.. విన్యాసాలు చేసే బైక్‌కు కనీసం నెంబర్ ప్లేట్ కూడా ఉండటం లేదని పోలీసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో లైకుల కోసం వీడియోలు తీసుకుంటున్నారు. వీరి వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వీడియోలతో విజయవాడ పోలీసులకు చాలెంజ్ విసురుతోంది. http://
సోషల్ మీడియా వీడియోల ఆధారంగానే పలువురిని గుర్తించేపనిలో పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విజయవాడ పోలీస్.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై గస్తీ పెంచారు. గతంలో బైకు రేసింగ్స్ పెరగడంతో.. వారిపై ఫుల్ ఫోకస్ పెట్టి అణచివేశారు పోలీసులు. అయినా పోకీరల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా కొందరు పోకిరీగాళ్లు ఇలా రెచ్చిపోయారు.
ఇటీవల బైక్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. అయినా యువతలో మార్పు రావడం లేదు. హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జిపై ఎలాంటి స్టంట్లు చేయకపోయినా.. ఇసుక పేరుకుపోయిన దగ్గర ఆటోను ఓవర్ టేక్ చేయబోయి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమదాం చూసిన తరువాత కూడా కొందరిలో మార్పు రావడం లేదు. ఇలా భయకంరమైన విన్యాసాలతో వారి ప్రాణాలతో చలగాటమాడడమే కాకుండా.. అటువైపు వెళ్తున్నవారిని కూడా భయపెడుతున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.