Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS 13 YEARS GIRL FORCED PROSTITUTION IN GUNTUR DISTRICT NGS GNT

Crime News: కరోనాకు నాటు వైద్యం పేరుతో దారుణం.. 13 ఏళ్ల బాలికతో తండ్రికి తెలియకుండా బలవంతంగా వ్యభిచారం

13 ఏళ్ల బాలిక తో బలవంతంగా వ్యభిచారం

13 ఏళ్ల బాలిక తో బలవంతంగా వ్యభిచారం

Girl forced prostitution: కరోనా సోకి తల్లి చనిపోయింది.. ఆమెకు కరోనా వచ్చి తగ్గింది.. అనుక్షణం కంటికి రెప్పలాకాడుకున్న తండ్రి కూతురు బాగోగులు పట్టించుకోలేదు.. కుటుంబ పరిస్థితిని ఆసారా చేసుకున్న.. ఓ మాయ లేడి కరోనాకు నాటు వైద్యం పేరుతో బాలికను చేరదిసింది. బలవంగా ఆమెతో వ్యభిచారం చేయింది. ప్రస్తుతం బాలికకు అనారోగ్యం రావడంతో దారుణం వెలుగు చూసింది.

ఇంకా చదవండి ...
  Guntur Girl forced prostitution: తండ్రి ఓ ఫ్యాక్టరీలో వాచ్ మెన్.. దీంతో పగలంతా ఆ ఫ్యాక్టరీలోనే ఉండాలి.. అతడి భార్య, కూతురు ఇద్దరికీ కరోనా పాజిటివ్ (Corona Positive) నిర్ధారణ అయ్యింది. దీంతో వారి ఇద్దర్నీ గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతడి భార్య జూన్ లో ప్రాణాలు విడిచింది. 13 ఏళ్ల బాలికకు నెగిటివ్ వచ్చినా.. కాస్త అనారోగ్యంతో (Health Problems) ఇబ్డంది పడేది.. ఆ చిన్నారి బాగోగులు చూసుకోవాల్సిన తల్లి  లేదు. తండ్రి వాచ్ మన్ ఎప్పుడు ఫ్యాక్టరీ దగ్గరే ఉండేవాడు.. దీంతో ఆ బాలిక బాగోగులను పట్టించుకునే వారు లేకుండా పోయారు. గుంటూరు స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ మహిళ ఆ విషయాన్ని తెలుసుకుంది. వెంటనే తాను ఓ ఆస్పత్రిలో నర్సును అని చెప్పి ఆ తండ్రిని పరిచయం చేసుకుంది. బాలిక పరిస్థితి బాగులేదని.. అమ్మ లేని పిల్ల కాబట్టి.. తాను తీసుకెళ్లి నాటు వైద్యం చేయిస్తానని.. ఆరోగ్యంగా తిరిగి వస్తుందని నమ్మించింది.

  ఆమె నర్సు అని చెప్పడం.. బాలిక బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో.. పూర్తిగా ఆ మాయ లేడి మాటలను నమ్మిన తండ్రి.. ఆమెతో పాటు బాలికను పంపించాడు.. అలా బాలికను తనతో పాటు తీసుకెళ్లిన ఆ కంత్రీ కిలాడీ.. బిజినెస్ ప్రారంభించింది. అనారోగ్యంతో ఉందని.. తల్లి లేని పిల్ల అని ఏ మాత్రం జాలి చూపించలేదు. కాసులపై కక్కుర్తితో వ్యభిచార రొంపిలోకి దింపింది. కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని మాయ మాటలతో మొదట లొంగదీసుకుంది.  ఆమె భయపడి ఇంటికి వెళ్లిపోతానని ఏడవడంతో భయభ్రాంతులకు గురిచేసింది.

  ఇదీ చదవండి : విశాఖ ఉక్కు పోరాటంలో పవన్ మరో అస్త్రం.. డిజిటల్ క్యాంపెయిన్‌తో హీట్.. ట్విట్టర్ లో వైరల్

  తండ్రిని, తనను చంపేస్తానని బెదిరింది. ఆమె నొప్పి వస్తోంది భరించలేనని చెబుతున్న వినకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చేయించింది.  అంత చిన్న వయసులో వ్యభిచారం చేయడం.. అప్పటికే ఆరోగ్యం బాగులేకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఇక బాలికతో పని లేదు అనుకున్న నిర్వాహకురాలు ఆమెను వదిలించుకోవాలని చెప్పి తిరిగి ఇంటికి పంపించేసింది..

  ఇదీ చదవండి: క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు.. అంతా 20 ఏళ్ల లోపు వయసువారే

  రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు మేడికొండూరు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు నర్సుగా నమ్మబలికిన వ్యభిచారం నిర్వాహకురాలుగా పోలీసులు గుర్తించారు.

  ఇదీ చదవండి: ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై చర్చలు సఫలం.. ఆందోళన విరమణ

  గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పల్నాడులోని 13ఏళ్ల బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం ఆమె కరోనా బారిన పడింది. ఆమె తల్లికి కూడా కరోనా సోకడంతో ఇద్దర్నీ గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ తల్లి చికిత్స పొందుతూ మరణించగా.. బాలిక నెగిటివ్ వచ్చి ఇంటికి చేరుకుంది. అయినా కాస్త ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేది. అదే సమయంలో స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజులకే వ్యభిచారం చేయాలని బాలికపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసింది. కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

  ఇదీ చదవండి: షణ్ముఖ్ మరో రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో ఫస్ట్ టైం.. అదే జరిగితే విన్నర్ అతడే

  గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యం పాలవడంతో వ్యభిచార నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో రెండు రోజుల క్రితం ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే ఆ బాలిక తప్పిపోయినట్లు ఆమె తండ్రి సుమారు రెండు నెలల క్రితం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియటంతో నల్లపాడు పోలీసులు కేసును క్లోజ్‌ చేశారు. రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలిస్తే అదుపులోకి తీసుకోకుండా ఇన్నాళ్ల పాటు దీన్ని గోప్యంగా ఉంచడం ఏమిటి? ఇప్పటి దాకా ఆ బాలిక ఎవరి చెరలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది.

  ఇదీ చదవండి: ఆ మంత్రికి షాక్ లపై షాక్ లు.. టీడీపీ కండువా కప్పుకున్న వాలంటీర్లు

  ఆ బాలికను తండ్రే అప్పగించారా? దీని వెనుక ఏమైనా బేరసారాలు జరిగాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.  నిందితులు వ్యభిచారం చేయిస్తారని ధ్రువీకరించుకున్నామన్నారు.  ప్రస్తుతం వారి  ఫోన్లు స్విచాఫ్‌ చేసి ఉంచారని, ఆ బాలిక కోలుకున్నాక పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu, Minor girl

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు