AP Crime News: గురువు స్ధానంలో ఉంటూ పాడు పనులకు పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు.. తాను అశ్లీల చిత్రాలు చూపించడమే కాదు.. వాటిని విద్యార్థులకు చూపించడం.. ఆ వీడియోల్లో ఉన్నవారికి ఆ విద్యార్దినుల పేర్లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఓ కీచక ఉపాద్యాయుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. కీచక గురువు విషయం తెలవిషయం తెలిసిన వెంటనే గ్రామస్తులంతా కలిసి దేహశుద్ధి చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్యానారు.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. దైవం లాంటి గురువుల స్దానాలలో ఉండి కొంత మంది ఉపాధ్యాయులు పాడు పనులకు దిగుతున్నారు. గురువే ప్రత్యక్ష దైవం అని రాసి ఉండే ఆ పాఠ్య పుస్తకాలలోని సూక్తులను బోధించాల్సిన గురువుల విక్ళత చేష్టలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరో అకృత్యం వెలుగుచూసింది. తండ్రి స్థానంలో ఉండి పిల్లలను చూసుకోవాల్సిన ఓ ఉపాధ్యాయుడు గురు స్థానానికి మచ్చ తీసుకువచ్చాడు.
ఇదీ చదవండి : అనుమానంతో గోడౌన్ వెళ్లి షాక్ తిన్నపోలీసులు.. గోవా మద్యం విలువ ఎంతో తెలుసా..?
చిన్నారులకు అశ్లీల వీడియోలు చూపించి తన వికృత కోణాన్ని పిల్లలకు పరిచయం చేశాడు. విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆ గురువు తన సెల్ లో ఉన్న బూతు వీడియోలు చూపిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని నవగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గొర్ల భానోజీ రావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్ధులను తన దగ్గరకు రమ్మని, శరీరాలను తాకుతూ .. సెల్ ఫోన్ లో ఉన్న నీలి చిత్రాలు చూడాలి అంటూ బలవంతం చేసేవాడు.
ఇదీ చదవండి : సీఎం జగన్ మీద నిందలు వేస్తే అదే జరిగేది..? పోసాని సంచలన వ్యాఖ్యలు
ఓ వైపు చేసిందే పాడు పనైతే.. ఇక ఆ అశ్లీల చిత్రాల్లో ఉన్న మహిళలను చూపించి వారికి తన క్లాసులోని విద్యార్థినుల పేర్లు పెట్టడం, అంతటితో ఆగకుండా విద్యార్థినుల ఇంటిలో ఉన్న మహిళలను కూడా వారితో పోల్చి చెబుతున్నాడు. దీంతో గురువు ఆగడాలను భరించలేని విద్యార్ధినులు.. స్కూల్ లో జరుగుతున్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన తల్లితండ్రులు.. స్కూల్ కు వచ్చి ఆ ఉపాధాయుడిని నిలదీసి దేహశుద్ధి చేశారు.
ఇదీ చదవండి : సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకోండి.. ఏపీ మంత్రి బొత్స సలహా
గురువు స్ధానంలో ఉండి తమ పిల్లల పట్ల ఉపాధ్యాయుడు భానోజీరావు చేస్తున్న విక్ళత చేష్టలను విద్యార్ధులు, తల్లిదండ్రులు ఊరి సర్పంచ్ ద్ళష్టికి తీసుకువెళ్లారు. వెంటనే విద్యార్ధులను అడిగి వివరాలను తెలుసుకున్న సర్పంచ్ నీరజ.. పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే ఆ ఊరికి చేరుకున్న పోలీసులు.. విద్యార్ధులను అడిగి వివరాలను తెలుసుకొని టీచర్ భానోజీరావును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి వేషాలు వేసేది ఎవరైనా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.