Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEW ON LORRY DRIVER RASH BEHAVIOR HE DASHED TOLL EMPLOYEE AND RUN AWAY NGS TPT

Lorry Driver: టోల్ ఫీజు అడిగినందుకు చుక్కలు చూపించిన డ్రైవర్.. ఏం చేశాడో చూడండి

లారీ డ్రైవర్ అమానుషం

లారీ డ్రైవర్ అమానుషం

Lorry Driver Rude Behavior: కర్నూలు జిల్లాలో జరిగిన దారుణ ఘటన వీడియో వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసిన ఆ వీడియో హల్ చల్ చేస్తోంది. దీంతో అమానుషంగా ప్రవర్తించిన ఆ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలి అంటున్నారు నెటిజన్లు..

ఇంకా చదవండి ...
  Lorry Driver:  లారీ డ్రైవర్ల (loory Drivers) తీరు ఎప్పుడూ వివాదాస్పదమే.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ఎక్కువ శాతం లారీల వల్ల జరుగుతున్నవే అని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందులో మానవ తప్పిదాలు ఎక్కువగా ఉంటాయి. అతి వేగం కావొచ్చు.. లేదా నిద్ర లేమి అవ్వొచ్చు.. మరికొందరు తాగి వాహనాలు నడిపే పరిస్థితి కూడా ఆ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అందుకే లారీ డ్రైవర్ల తీరు ఎప్పుడూ వివాదాస్పదమే అవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ప్రమాదం అని తెలిసినా కొందరు లారీ డ్రైవర్ల తీరు మారదు.. రోడ్డు అంటే తమ సొంత జాగీరు అనేలా వ్యవహరిస్తారు. పక్కవాళ్ల గురించి పట్టించుకోరు. మరోవైపు తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరు షాకిచ్చింది.. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైంది.

  కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్ గేట్ వద్ద ఓ లారీ డ్రైవర్ ను సిబ్బంది టోల్ ఓవర్ ఆక్సిషిన్ ఫీజు అడిగారు. అలా అడగడమే ఆ టోల్ సిబ్బంది తప్పైంది. టోల్ సిబ్బంది ఆపుతున్నా.. ఆ లారీ డ్రైవర్ వినలేదు.. టోల్ ఫీజు అడగడానికి ఎంత ధైర్యం అని అంటూ.. లారీని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయినా ఆ టోల్ సిబ్బంది అడ్డుపడే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు లారీ ఆపేందుకు ముందు భాగంపై ఎక్కాడు. అప్పుడైనా లారీర ఆపాలని ఆ డ్రైవర్ కు అనిపించలేదు. ఆ ఉద్యోగి ఏమైతే తనకేంటి అనుకున్నాడు. ఆ వ్యక్తి లారీ ముందు భాగంలో ఉన్న పట్టించుకోకుండా లారీని అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లాడు.

  ఇదీ చదవండి : ఒకటి రెండు కాదు.. 300 లారీలు.. 48 గంటలకుపైగా అవస్థలు.. భువనేశ్వర్ లో ఏం జరిగిందంటే..?

  అది కూడా ఒకటి రెండు కాదు.. ఏ మాత్రం కనికరం లేకుండా.. 10 కిలోమీటర్ల మేర లారీని అత్యంత వేగంగా తీసుకెళ్లాడు. అప్రమత్తమైన సిబ్బంధి లారీ వెంబడించి.. ఆ సిబ్బందిని కాపాడారు. ఇప్పుడు ఆ ఘటనకు సంభందించిన వీడియో వైరల్ గా మారుతోంది. అసలు ఆ ఘటనకు గల కారణాలేంటి...? ఈ దారుణ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా దగ్గర జరిగింది. రెగ్యులర్ గా అక్కడి సిబ్బంది ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కానీ వాహనాలను మ్యానువల్ స్కానింగ్ చేస్తారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ లారీ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కాకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బంది మ్యానువల్ స్కానింగ్ చేసేందుకు ప్రయత్నించారు.

  ఇదీ చదవండి : ఛీఛీ ఇయనేం డాక్టర్.. కూతురులాంటి మైనర్ తో ఈ వయసులో ఇవేం చేష్టలు..

  లారీని ఆపమని గుత్తి టోల్‌గేట్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. లారీని ఆపేందుకు అమకతాడు టోల్ ప్లాజా సిబ్బంది శ్రీనివాసులు ప్రయత్నం చేసాడు.  లారీ ముందు భాగంపై ఎక్కినా.. డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే 10 కిలోమీటర్లు పోనిచ్చాడు. అప్రమత్తమైన టోల్‌గేట్ సిబ్బంది నాలుగు బైక్‌లతో లారీని వెంబడించి... హైవే పోలీసులకు సమాచారం అందించారు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి శ్రీనివాసులును కాపాడారు. నిన్న జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, FASTag, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు