హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Crime News: భోజనంలో కూర పెట్టలేదని తల్లితో గొడవ.. చివరికి ఏం చేశాడంటే..?

AP Crime News: భోజనంలో కూర పెట్టలేదని తల్లితో గొడవ.. చివరికి ఏం చేశాడంటే..?

AP Crime News: నిత్యం అన్నంతో పాటు కూత తినాలి అంటే అప్పుడప్పుడూ కుదరకపోవచ్చు.. అలా కూర లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు.. ఉన్నదానితో సర్దుకుపోతారు.. ఓ కిరాతకుడు మాత్రం.. కని మోసి పెంచిన అమ్మ అని కూడా చూడకుండా.. కేవలం కూర పెట్టలేదన్న చిన్న కారణంతో.. అతి కిరాతకానికి ఒడిగట్టాడు.

ఇంకా చదవండి ...

  Son Assassinated The Mother: మద్యం మత్తు (Liquor) మనుషులను నర రూప రాక్షసులుగా మారుస్తోంది. పీకల దాకా తాగితే తమను తామే మర్చిపోతున్నారు కొందరు మందుబాబులు.. ఆ మత్తు బంధాలను సైతం బలి తీసుకుంటోంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా ఓ కొడుకు.. తనను కని పెంచి ఇంతకాలం మోసిన కన్నతల్లిని అతి కిరాతకంగా హత్య  (Murder) చేశాడు . అది కూడా కేవలం భోజనంలో కూర లేదనే కారణంతో ఇలా రాక్షసుడిలా మారాడు. మొదట చిన్నగా అమ్మతో గొడవపడ్డ పుత్రరత్నం.. తరువాత మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరాడు. దీంతో అత్యంత కర్కశంగా గొడ్డలితో తలపై మోది హతమార్చాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) లోని జి.మాడుగు(G Madugula) ఏజెన్సీలో చోటు చేసుకు౦ది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చిన ఘటన కలకలంగా మారింది. కూర పెట్టకపోతే హత్య చేయడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.. అలాంటి కొడుకును ఊరికే వదిలేయకూడదని డిమాండ్ చేస్తున్నారు.

  స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ అడ్డులలో రేగం రాజులమ్మ, రామన్న దొర దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు మత్స్యలింగం, అర్జులమ్మ, రామన్న దొర కలిసి ఓ ఇంటిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యలింగం పూటుగా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భోజనం పెట్టమని తల్లి 60 ఏళ్ల అర్జులమ్మను కోరాడు. రసంతో అన్నం పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూరతో భోజనం పెట్టలేదని కోపగించుకుని తల్లితో గొడవకు దిగి కొట్టాడు.

  ఇదీ చదవండి : ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. బహుమతులు గెలుచుకోండి.. ఆకట్టుకుంటున్న పోలీస్ ఆఫర్

  అడ్డుకున్న తండ్రి రామన్న దొరను బెదిరించడంతో ఆయన గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద కొడుకు లక్ష్మణరావు ఇంటికి పరుగుతీశాడు. ఇంతలో మత్స్యలింగం గొడ్డలి వెనుక భాగంతో అర్జులమ్మ తలపై తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో తల్లి తలపై మత్స్యలింగం గొడ్డలితో మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త రామన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.

  ఇదీ చదవండి : ఛీ ఛీ ఇదేం పని.. బంధువు అని పెళ్లికి పిలిస్తే.. ఇలా చేస్తాడా..?

  కూర లేని కారణంగా కన్న తల్లిని హత్య చేసిన ఘటన పెను కలకలం రేపుతోంది. ఆ కొడుకు తీరుపై అంతా మండిపడుతున్నారు. వెంటనే అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakha

  ఉత్తమ కథలు