Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CREATES NEW RECORD IN TELEMEDICINE SERVICE IN THE COUNTRY FULL DETAILS HERE PRN

AP Government: ఏపీ ప్రభుత్వం ఆల్ టైమ్ రికార్డు.. దేశంలో 50శాతం ఇక్కడి నుంచే..!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వైద్య సేవలు (Health Service) పెరుగు పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు నాడు-నేడు పేరుతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. వీటితో పాటు డిజిటల్ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వైద్య సేవలు (Health Service) పెరుగు పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు నాడు-నేడు పేరుతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. వీటితో పాటు డిజిటల్ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పేపర్ లెస్ ట్రీట్ మెంట్, టెలీమెడిసన్ సేవలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా టెలిమెడిసన్ సేవల్లో ఏపీ సర్కార్ దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క రోజులో ఏకంగా లక్ష కన్సల్టేషన్లు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈనెల 4వ తేదీన దేశవ్యాప్తంగా 2,04,858 టెలి కన్సల్టేషన్లు నమోదైతే అందులో ఏకంగా 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఒక్క ఏపీలోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు మనకంటే వెనుకబడ్డాయి. తమిళనాడులో 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణలో 5,574, కేరళలో కేవలం 543 టెలి కన్సల్టేషన్లు నమోదయ్యాయి.

    మారమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 2019లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలు ఈ-సంజీవని పేరుతో టెలీమెడిసన్ సేవలను ప్రారంభించాయి. ఐతే అప్పటి నుంచి దీనికి అంతగా ప్రాచుర్యం కల్పించలేదు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని టెలీమెడిసన్ సేవలకు ప్రచారం కల్పించింది.

    ఇది చదవండి: ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ..? సభ ముందుకు వచ్చే అంశాలు ఇవేనా..?


    ఏపీలో టెలీమెడిసన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 27 హబ్ లను ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లను ఎటాచ్ చేసింది. ఒక్కో హబ్ లో ఇద్దరు జనరల్ మెడిసన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులను అందుబాటులో ఉంచింది.

    ఇది చదవండి: అందరికీ ఆదర్శం ఈ ఐఏఎస్.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చిన శాప్ ఎండీ..


    అమలు ఇలా..
    ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లకు వచ్చిన వారికి ప్రత్యేకమైన వైద్యం అవసరమైతే అక్కడున్న సిబ్బంది వెంటనే టెలీమెడిసన్ ద్వారా హబ్ లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్దరిస్తారు. అక్కడి డాక్టర్లు ఆడియా, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి వారికి ట్రీట్ మెంట్ ఇస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా ప్రిస్క్రిప్టన్ కూడా ఇస్తారు. ఆ మందులను విలేజ్ క్లినిక్ లోని వైద్య సిబ్బంది అందిస్తారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఇంటి నుంచే ఈ-సంజీవనీ యాప్ ద్వారా నేరుగా టెలీమెడిసన్ సేవలు పొందే అవకాశముంది.



    స్మార్ట్ ఫోన్లు లేనివారికి మరో సౌకర్యం
    పల్లెల్లో స్మార్ట్ ఫోన్లు లేనివారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామాల్లో పనిచేసే ఆశావర్కర్లకు 42 వేల స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటన్నింటినీ మెడికల్ హబ్ లకు అనుసంధానిసతారు. ఆశావర్కర్లు స్మార్ట్ ఫోన్ లేని రోగుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి మెడికల్ హబ్ ను సంప్రదించి చికిత్స అందేలా చూస్తారు. దేశంలో టెలీమెడిసన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 4,00,40,925 కన్సల్టేషన్లు నమోదైతే అందులో 1,89,59,021 కన్సల్టేషన్లు అంటే 47.34 శాతం ఏపీ నుంచే నమోదయ్యాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Health

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు