• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY TO START SECOND PHASE OF YSR CHEYUTHA SCHEME ON TUESDAY FULL DETAILS HERE PRN

YSR Cheyutha Scheme: రేపు వారి ఎకౌంట్లలో రూ.18,000.., నేరుగా జమచేయనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వరసగా రెండో ఏడాది మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసగా రెండో ఏడాది మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. మహిళల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యంగా వారికి ఆర్ధిక సాయం చేసేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయనుంది. పేద మహిళలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000 కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరసగా రెండో ఏడాది 23,14,342 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా వారి ఎకౌంట్లలోనే జమచేయనుంది. మంగళవారం అందిస్తున్న 4,339.39 కోట్లతో కలిపి వైఎస్సార్‌ చేయూత కింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 8,943.52 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్ధిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయునున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ప్రతీ ఏటా రూ. 18,750 చొప్పున వరసగా నాలుగేళ్ళలో మొత్తం రూ.75,000 ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పేదింటి మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటునందించడం వల్ల ఆర్ధిక, సామాజిక పరిస్ధితులు పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    ఇది కాక అడిగిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు వంటి అనేక జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ, వంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో టైఅప్‌ చేయించి చేయూతనిస్తూ నడిపిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ప్రతీ నెలా సామాజిక ఫించన్లు అందుకుంటున్న 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల 6 లక్షలకు పైగా ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడటానికి, ఫించన్‌కు అదనంగా వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ది అదిస్తున్నట్లు తెలిపింది.

    ఇది చదవండి: రోజుకు 25 లక్షల మందికి వ్యాక్సిన్.. సీఎం జగన్ నయా టార్గెట్..



    ఇప్పటికే 78,000 మంది లబ్ధిదారులు కిరాణా దుకాణాలు, 1,90,517 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టి వారి కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. లబ్దిదారులను కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు వైఎస్సార్‌ చేయూత కాల్‌ సెంటర్‌ 0866 – 2468899, 9392917899 నెంబర్లు ఏర్పాటు చేసింది. నిరంతరం పర్యవేక్షించి అవసరమైన సహాయం, శిక్షణ అందించేందుకు కమాండ్‌ కంట్రలో సెల్‌ ఏర్పాటు చేసింది.

    ఇది చదవండి: బాధపెట్టి ఉంటే క్షమించండి... వారికి సారీ చెప్పిన యాంకర్ ప్రదీప్


    కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి మార్కెట్‌ రేట్‌ కంటే తక్కువకు నాణ్యమైన సరుకులు. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు మార్కెట్‌లో ఇస్తున్న రేట్‌ కన్నా లీటర్‌ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం అందేలా ప్రభుత్వం ఒప్పందం చసుకుంది.
    Published by:Purna Chandra
    First published: