• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY TO LAUNCH JAGANANNA VASATHI DEEVENA SCHEME TO DAY WILL DEPOSIT MAINTENANCE CHARGES FOR STUDENTS FULL DETAILS HERE PRN

AP Welfare schemes: మరో కొత్తపథకానికి సీఎం జగన్ శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో నగదు జమ

AP Welfare schemes: మరో కొత్తపథకానికి సీఎం జగన్ శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో నగదు జమ

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ (AP Welfare Scheme Calandar) ను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. ఈ నెలలోనే నాలుగో పథకానికి శ్రీకారం చుట్టింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలకు సిద్ధమైంది. ఇప్పటికే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం.. జగనన్న విద్యాదీవేన, రైతులకు సున్నా వడ్డీ రాయితీలు, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ పథకం అమలు చేసిన ప్రభుత్వం ఈనెలలో రెండోసారి విద్యార్థుల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జగనన్న వసతి దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు మన చేయనుంది. నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి 11 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద 2020–21 సంవత్సరానికి 11,92,834 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,147.41 కోట్లు జమ కానున్నాయి. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత వారం జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు రూ. 671.45 కోట్లు మొదటి త్రైమాసికానికి విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించింది.

    బుధవారం వసతి, భోజన, రవాణా ఖర్చులకు గానూ మరో రూ. 1,147.41 కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేస్తుంది.

    ఇది చదవండి: మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. ఇకనైనా మార్పు వస్తుందా..?


    జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,220.99 కోట్లను చెల్లించింది. ఇప్పుడు మొదటివిడతగా రూ. 1,147.41 కోట్లు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తోంది. దీంతో ఇప్పటివరకు వసతిదీవెన కింద రూ. 2,368.40 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. ఇప్పటివరకూ విద్యారంగంపై వివిధ పథకాల కింద ఏపీ ప్రభుత్వం రూ. 25,812.60 కోట్ల సాయాన్ని 1,60,75,373 మందికి అందించింది.

    ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్... ఉదయం 9గంటల వరకే షాపులు... ఎక్కడో తెలుసా..?


    మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది అందించే జగనన్న అమ్మఒడి పథకంపైనా దృష్టి పెట్టింది. ఈ పథకంలో భాగంగా 9వ తరగతి నుంచి 12వ చదివే విద్యార్థులకు నగదుకు బదులు ల్యాప్ టాప్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం.. దానికి సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. స్కూళ్లు, కాలేజీల ద్వారా వివరాలు తెప్పించుకొని త్వరలోనే తయారీ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వనుంది. ల్యాప్ టాప్ లకు రిపేర్లు వస్తే వారం రోజుల్లోనే సర్వీసింగ్ చేసిచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటోంది.
    Published by:Purna Chandra
    First published: