• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY INAUGURATES AZADI KA AMRUTH MAHOTSAV CELEBRATIONS BY FACILITATING NATIONAL FLAG DESIGNER PINGALI VENKAIAH FAMILY FULL DETAILS HERE PRN

Andhra Pradesh: పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం జగన్ సత్కారం... భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ

Andhra Pradesh: పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం జగన్ సత్కారం... భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ

పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సత్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amruth Mahotsav)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. భారతీయ జాతీయ పతకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్మృతిగా ఆయన కుటుంబాన్ని జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రిని పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్ తో పంచుకున్నారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మితో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్.. ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన ఫోటోలను తిలకించారు. అనంతరం పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు.

    తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. భారత జాతీయ జెండాను ప్రతిబింబించేలా.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు సీఎం కేసీఆర్. భారత స్వాతంత్ర్య ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారన్ని.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: గెలిచినా అధికారం ఇవ్వలేదు... ఏపీలో సర్పంచుల వింత బాధ



    ''భారత స్వాతంత్ర్య చరిత్ర ప్రపంచ పోరాట చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. గాంధీజీకి ముందు ఎంతో మంది పోరాటం చేశారు. కానీ మహాత్మా గాంధీ వచ్చిన తర్వాతే స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతమయింది. ఉప్పు సత్యాగ్రహంతో దేశం మొత్తాన్ని ఏకం చేశారు. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించిన రోజే స్వాతంత్ర్య అమృత ఉత్సవాలను ప్రారంభిస్తున్నాం. దండి మార్చ్ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనే ముఖ్యమైన ఘట్టం. స్వాతంత్ర్య చరిత్రను నేటి తరాలకు తెలియజెప్పాలి. అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

    మన దేశానికి స్వాతంత్ర్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్రం స్వాతంత్ర్య సంబరాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ వేడుకల గురించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మార్చి 12, 2021 నుంచి ఆగస్టు 15, 2022 వరకు వేడుకలు జరుగుతాయి.
    Published by:Purna Chandra
    First published: