Home /News /andhra-pradesh /

AP IT Policy: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వినూత్న ఆలోచనకు సీఎం జగన్ శ్రీకారం..

AP IT Policy: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వినూత్న ఆలోచనకు సీఎం జగన్ శ్రీకారం..

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి పక్కా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) అధికారులను ఆదేశించారు.

  ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి పక్కా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి నూతన ఐటీ పాలసి, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక కరోనా పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నందున ఈ కాన్సెప్టును మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్ తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నారని.. ఈ చర్యలతో గ్రామాలనుంచే వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ మరింత బలోపేతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

  ఇక మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైఎండ్‌ స్కిల్స్‌ మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరముందన్నారు. .హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనివల్ల వారిలో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయన్నారు.

  ఇది చదవండి: మెగాస్టార్ కు థ్యాంక్స్ చెప్పిన సీఎం... ఆ ఘనత వారిదేనన్న జగన్


  భవిష్యత్తులో విశాఖపట్నం అనేది ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందన్న సీఎం.., కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు విశాఖ ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందన్నారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాలని.., ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా ఈ యూనివర్శిటీ మారాలని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది కూడా ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామన్నారు. కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని.., ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుందన్నారు.

  ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ ఎత్తివేత..? ప్రభుత్వం కీలక నిర్ణయం అప్పుడే...


  ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు
  విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్‌ సిటీలు అభివృద్ధి చేయాలని.., దీనికి అవసరమైన భూములను గుర్తించాలన్నారు. కాన్సెప్ట్‌సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్‌ ఈఎంసీ ప్రగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. అక్టోబరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

  ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్ హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, IT Employees, Mekapati Goutam Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు