• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY CONDUCTED REVIEW ON AGRICULTURE AND HORTICULTURE RELATED ISSUES IN STATE FULL DETAILS HERE PRN

AP CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. రూ.14వేల కోట్లతో స్పెషల్ ప్లాన్...

AP CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. రూ.14వేల కోట్లతో  స్పెషల్ ప్లాన్...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) రైతులకు ఎలాంటి సమస్య రావడానికి వీల్లేదని.. ముఖ్యంగా మౌలిక సదుపాయల విషయంలో లోటు ఉండకూదని సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రా) పై ముఖ్యమంత్రి వైఎశ్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులు అందరికీ కూడా డ్రిప్, స్పింక్లర్‌ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్,స్ప్రింక్లర్‌ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మసేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఏంచేసినా శాచ్యురేషన్‌ పద్ధతిలో ఉండాలన్న సీఎం.. కొందరికి మాత్రమే పథకాలు అనే పరిస్థితి రాకుండదని.. అందరికీ అందాలని స్పష్టం చేశారు. అలాగే ఎక్కడా అవినీతికి చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలన్నారు. రైతులకు ఏ అంశంలోనూ ఇబ్బందులు లేని పరిస్థితులు కల్పించాలనీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

    రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడంద్వారా రేటు తగ్గుతుందని, దీనివల్ల ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్‌ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుందని జగన్ పేర్కొన్నారు.

    ఇది చదవండి: ఏపీలో హీటెక్కిన లోకల్ వార్... హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఎస్ఈసీ...



    రాష్ట్రంలో సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మల్బరీని సాగుచేస్తున్న రెతులకు ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని తెలిపారు.

    ఇది చదవండి: ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఆ ఐదు జిల్లాల్లో డేంజర్ బెల్స్


    అగ్రి ఇన్‌ఫ్రాపై  సమీక్ష
    అగ్రి ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్సస్‌ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉద్యాన రైతులకు డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ యూనిట్లు ఇలా రైతులకు 14 రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. వీటికోసం దాదాపు రూ.14,562 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో ఉంచాలని సీఎం ఆదేశించారు.

    ఈ సమావేశంలో ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛెర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు