YS Jagan Tour : నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ

YS Jagan Delhi Tour | Andhra Pradesh : తన ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నారు. అమరావతి అంశం, మండలి రద్దు సహా కొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


Updated: February 12, 2020, 5:24 AM IST
YS Jagan Tour : నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
  • Share this:
YS Jagan Delhi Tour | AP NEWS : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అది ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధాని మోదీని జగన్ కోరనున్నట్లు సమాచారం. అలాగే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు కొన్ని కీలక అంశాల్ని జగన్ మరోసారి ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చే అవకాశముంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు సరిగా కేటాయించలేదని ప్రధాని దృష్టికి తేబోనున్నారు.

ప్రధాని మోదీతో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా జగన్ సమావేశం కాబోతున్నారని. రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ లోటుపై చర్చించే అమిత్ షాతో ఛాన్స్ ఉంది. రాత్రి 7 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌... ఢిల్లీ నుంచి తిరుగు పయనమవుతారు. రాత్రి 9.40కి జగన్ తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకుంటారు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వ వర్గాలు సీఎం జగన్ టూర్‌ షెడ్యూల్‌ని ఖరారు చేశాయి.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు