• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CM YS JAGAN STARTS YSR ZERO INTEREST SUBSIDY SCHEME FOR FARMERS IN STATE FULL DETAILS HERE PRN

YSR Zero Interest Scheme: రైతుల ఖాతాల్లో నేరుగా నగదు.. మరో పథకం ప్రారంభించిన సీఎం జగన్

YSR Zero Interest Scheme:  రైతుల ఖాతాల్లో నేరుగా నగదు.. మరో పథకం ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సున్నా వడ్డీ రుణాల ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరమని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 రబీకి సంబంధించిన రుణాలపై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రంలో 62శాతం జనాభాకు ఉపాధి కల్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ప్రపంచమంతా రైతుపై ఆధారపడి జీవిస్తోందన్నారు. నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ రైతుల కోసం ఉద్దేశించినవే ఉన్నాయన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకిచ్చిన హామీల్లో అమల్లో భాగంగా 6లక్షల 28వేల మంది రైతులకు 2019 రబీ వడ్డీ రాయితీ కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద రూ.128.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నమన్నారు. 2019-20 రబీలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. 2019 జూన్ నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద 61లక్షల 22వేల 585 మంది రైతులకు రూ.1,132 కోట్లు చెల్లించింనట్లు తెలిపారు. ఇప్పటివరకు రైతులకు దాదాపు 1300 కోట్లు రైతులకు సున్నావడ్డీ రాయితీ ఇచ్చామన్నారు.

    పాదయత్ర సందర్భంగా ప్రతి జిల్లాలోనూ రైతుల కష్టాలు తెలుసుకుంటా.. వాటికి కారణాలపై అధ్యయనం చేసినట్లు జగన్ తెలిపారు. ప్రతిక్షణం రైతులకు ఎలా న్యాయం చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు వివరించారు. పెట్టుబడి పెరగడం వల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయన్నారు. అలాగే రైతుల కష్టాన్ని దోచుకుంటున్న దళారీలు వల్ల, పంటకు గిట్టుబాటు ధరరాకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు వస్తున్నట్లు జగన్ అభిప్రాయపడ్డారు. రైతులు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

    ప్రభుత్వం అమలు చేసే ప్రతిపథకంలోనూ రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 18లక్షల 70వేల పంపుసెట్లకు పగటిపూటే 9గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దీని వలల ఏడాదికి రూ.8,800 కోట్లు ఖర్చు భరిస్తున్నామన్నారు. విద్యుత్ కోసం ఈ రెండేళ్లలో రూ.17,430 కోట్లు చేశామన్నారు. దీనికి అదనంగా మరో రూ.1700 కోట్లు ఖర్చు చేశామన్నారు. దీని ద్వారా ఏడాదికి రూ.46వేల మేర రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.

    వైఎస్ఆర్ భరోసా కింద ప్రతి రైతు ఖాతాలోనూ క్రమం తప్పకుండా రూ.13,500 ఇస్తున్నామన్నారు. దీంతో 80శాతం పెట్టుబడి ఖర్చుకు సమకూరుస్తున్నామన్నారు. 51 లక్షల మందికి రూ.13,101 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు అన్ని విషయాల్లో సహకారం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు కేవలం రూపాయికే ఇన్సురెన్స్ పథకం అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇందుకోసం రూ.1.961 కోట్ల ఇన్సూరెన్స్ చెల్లించామన్నారు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఖరఫ్ లో రూ.289 కోట్లు చెల్లించామన్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేలు కేటాయించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పంట కొనుగోలుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

    ఇక గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.384 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు జగన్ వెల్లడించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటలను e-క్రాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఇన్సురెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, పంటరుణం, పంట కొనుగోళ్ల వంటి కార్యక్రమాలకి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యకమ్రంలో మంత్రి కురసాల కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published: