ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత కింద నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.3928.88 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నామని జగన్ తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ వైయస్సార్ రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత కింద నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.3928.88 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నామని జగన్ తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ వైయస్సార్ రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ 23 నెలలలో దాదాపు రూ.89 వేల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం జగన్ వివరించారు. ప్రతి పేదవాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని గర్వంగా చెబుతున్నాని జగన్ అన్నారు. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద అక్షరాలా రూ,17,029 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. తాము అదికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం రూ.68 వేల కోట్లకు పైగానే సాయం అందించినట్లు వివరించారు.
52 లక్షల మందికి రైతు భరోసా.. వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలు కూడా కలుపుకుంటే అక్షరాలా 67.50 లక్షల రైతులకు రూ.1,261 కోట్లు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగామని జగన్ అన్నారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా 15.67 లక్షల రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇచ్చామన్నారు. ఇక ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1038 కోట్ల., ధాన్యం కొనుగోలకు కోసం అక్షరాలా రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని జగన్ తెలిపారు.
ఇక ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.17,430 కోట్లు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అలాగే గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు, విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు వెచ్చించామని జగన్ పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1224 కోట్లు, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50 కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ.., దాదాపు రూ.1560 ఖర్చు చేశామని జగన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ఆర్ఓఎఫ్ఆర్) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పథకం వర్తింపజేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇక ఈ పథకం కింద అర్హులుంటే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అలాగే రైతు భరోసాపై ఏమైనా సమస్యలుంటే 155251 నంబర్ కు కాల్ చేయాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.