హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాకు సీఎం జగన్ లేఖ.. వరదసాయంపై విజ్ఞప్తి..

YS Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాకు సీఎం జగన్ లేఖ.. వరదసాయంపై విజ్ఞప్తి..

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు, వరదలు (AP Floods) అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి విలయానికి లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వేలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. (AP CM YS Jagan Mohan Reddy) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Home Minister Amit Shah) లేఖలు రాశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు, వరదలు (AP Floods) అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి విలయానికి లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వేలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. (AP CM YS Jagan Mohan Reddy) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Home Minister Amit Shah) లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ కు తక్షణ వరదసాయం కింద రూ.1000 కోట్లు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు. ఐఎంటీసీ బృందాలను పంపాలని కోరారు. భారీ వర్షాలు, వరదల వల్ల రూ.6.54వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

  అల్పపీడన ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని.. చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైందని జగన్ లేఖలో రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అలాగే తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట ప్రాంతాలు భారీ వర్షాలకు నీటమునిగాయన్నారు. మొత్తం 196 మండలాలు నీటమునగగా.. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో రోడ్లు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని..చెరువులకు గండ్లు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగి అపార నష్టంవాటిల్లినట్లు వివరించారు.

  ఇది చదవండి: కొండపల్లిలో ముగిసిన ఛైర్మన్ ఎన్నిక.. ఓటు వేసిన కేశినేని నాని.. కోర్టులో ఫలితాలు..


  రాష్ట్రంలో వరజల రణంగా 1.43 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలు దెబ్బతినగా, 42,299 హెక్టార్లలో అరటి, పసుపు, బొప్పాయి, పసుపు, ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు లేఖలో పొందుపర్చారు. అలాగే నాలుగు జిల్లాల్లో 1,887.65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. 240.90 కిలోమీటర్ల రోడ్లు, 59.6 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల డ్రెయినేజీ, 71 స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయన్నారు. అలాగే 2,254.32 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బన్నాయని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

  ఇది చదవండి: మూడు రాజధానుల బిల్లు రద్దు విశాఖకు లాభమా..? నష్టమా..? రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి..?


  నష్టం పరంగా చూస్తే వ్యవసాయంలో రూ.1,353.82 కోట్లు, ఉద్యాన పంటలు రూ.48.06 కోట్లు, రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలపై రూ.1,756.43 కోట్లు, జలవనరులకు సంబంధించి రూ.556.96 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.252.02 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.453.33 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.381.65 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.1,252.02 కోట్లు.. ఇలా మొత్తం రూ.6,054.29కోట్ల మేర నష్టం జరిగినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ సీఎం లేఖకు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Narendra modi

  ఉత్తమ కథలు