హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ .. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గోనున్న ఏపీ సీఎం

CM YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ .. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గోనున్న ఏపీ సీఎం

సీఎం జగన్ (file image - news18)

సీఎం జగన్ (file image - news18)

AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జరిగే ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్‌ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఈ టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YS Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో బిజీగా ఉండబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఢిల్లీ.. లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగబోయే ఆంధప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశం (Global Investors Summit)లో పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో సీఎం జగన్.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ప్రసంగించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 6.05 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50కి తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్తారు సీఎం జగన్. ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్రంలోని పెద్దలెవరినీ కలుసుకోవడం లేదని సమాచారం.

రాత్రే ఢిల్లీ పర్యటన : సీఎం జగన్ తన పర్యటనకు సంబంధించి నిన్న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరగా.. కాసేపటికే ఫ్లైట్‌లో సాంకేతిక లోపం రావడం వల్ల వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఆయన తిరిగి మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. రాత్రి 10:55కి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరారు. ప్రస్తుతం నంబర్ 1, జన్‌పథ్‌లో బస చేసిన జగన్... షెడ్యూల్ ప్రకారం.. సదస్సుకు వెళ్తారు.

ఎందుకీ ఢిల్లీ సదస్సు :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు రావట్లేదనీ.. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించలేకపోతోందని అంటున్నాయి. ఈ ఆరోపణలను ఖండిస్తున్న ప్రభుత్వం.. ఈ సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు రాబట్టాలని భావిస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతుంది. దానికి హాజరు కావాల్సిందిగా కోరేందుకు ఇవాళ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. అందువల్ల ఇవాళ జరిగే సదస్సు... సన్నాహక సదస్సుగా భావిస్తున్నారు. ఇవాళ్టి సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఉంటారు. అలాగే వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు.

ఇది కూడా చదవండి : Budget 2023 : నేడు పార్లమెంట్ ప్రారంభం.. రేపు బడ్జెట్ .. ఇదీ షెడ్యూల్

విమానానికి ఏమైంది?

సీఎం వైఎస్ జగన్ నిన్న సాయంత్రం ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. షెడ్యూల్ ప్రకారం ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడిందని సిబ్బంది గుర్తించారు. వెంటనే తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు. ఇలా... గన్నవరం విమానాశ్రయం నుంచి 5.03కి టేకాఫ్ అయిన విమానం 5.20కి అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Cm jagan, Delhi, Telugu news, Ys jagan

ఉత్తమ కథలు