• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY STRICT ORDERS TO SPECIAL ENFORCEMENT BUREAU SEB OFFICIALS AK

Andhra Pradesh: వాళ్లను వదలొద్దు.. ఆ అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh: వాళ్లను వదలొద్దు.. ఆ అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ పోటో)

CM YS Jagan: సరిహద్దు రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సమర్థత, నిజాయితీ ఉన్న మరికొంత మంది అధికారులకు ఎస్‌ఈబీలో స్థానం కల్పించాలని సూచించారు.

  • Share this:
    అక్రమాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టేవారిని ఉపేక్షించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. వారికి పలు కీలక సూచనలు చేశారు. గత ఏడాది మే 16న ఏర్పాటైన ఎస్‌ఈబీ పనీతీరుపై అధికారులు సీఎం జగన్‌కు నివేదిక అందించారు. సరిహద్దు రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సమర్థత, నిజాయితీ ఉన్న మరికొంత మంది అధికారులకు ఎస్‌ఈబీలో స్థానం కల్పించాలని సీఎం జగన్ సూచించారు. వ్యవస్థల్లోనూ అవినీతికి ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్ వారికి సూచించారు.

    ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉద్ధృతంగా దాడులు చేయాలని సూచించారు. ఎస్‌ఈబీకి కావాల్సిన అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించండి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. గత ఏడాది మే 16న ఏర్పాటైన ఎస్‌ఈబీ.. మద్యం అక్రమాలపై 79,632 కేసులు నమోదు చేసిందని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు 4,85,009 లీటర్ల మద్యం పట్టుకున్నామని.. 22,715 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని నివేదించారు.

    వీరితో పాటు అక్రమాలకు పాల్పడిన 240 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇసుక అక్రమాల్లో 7,244 కేసులు నమోదయ్యాయని... 4,79,692 టన్నుల ఇసుక స్వాధీనం చేకున్నామని.. 9,689 వాహనాలు సీజ్‌ చేశామని ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడ్డ 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేశామని.. మద్యం, ఇసుక అక్రమాలకు పాల్పడిన 82 మంది పోలీసులపై కూడా కేసులు పెట్టామని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు