Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY LAUNCHED 3RD PHASE OF JAGANANNA AMMAVODI SCHEME IN SRIKAKULAM FULL DETIALS HERE PRN

Jagananna Ammavodi: అమ్మఒడి మూడో విడత నగదు జమ..! అందుకు బాధగా ఉందన్న సీఎం జగన్

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అమ్మఒడి పథకాన్ని (Jagananna Ammavodi) అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ (CM YS Jagan) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 43 లక్షల 96వేల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లను జమ చేశారు.

ఇంకా చదవండి ...
  పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అమ్మఒడి పథకాన్ని (Jagananna Ammavodi) అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ (CM YS Jagan) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 43 లక్షల 96వేల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆయన అన్నారు. చదువు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆదాయం కూడా చాలా ఎక్కువన్నారు. ఏ ప్రభుత్వమైన చదువుపై పెట్టే ఖర్చు ఓ పవిత్రమైన పెట్టుబడి అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ విలువైన చదువులు అందించాలనే లక్ష్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన చదువును హక్కుగా అందిస్తున్నామన్నారు.

  జగనన్న అమ్మఒడి పథకం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిన కార్యక్రమం అని జగన్ తెలిపారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మఒడి స్కీమ్ ద్వారా మూడేళ్లలో రూ.19,618 కోట్లును లబ్ధిదారులకు అందించామన్నారు. ఆర్ధిక ఇబ్బందులు చదువుకు ఆటంకాలు కాకూడదనే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు వివరించారు. ఈ పథకం కింద విద్యార్థులు ఏ స్కూల్లో చదివినా జగన్ మామకు అభ్యంతరం ఉండదని.. పిల్లల చదవే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. పరీక్షలు, సెలవులు వివరాలివే..


  పిల్లలకు బడికి వెళ్తేనే చదవు వస్తుందని.. అందుకే 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ జీవోలో పొందుపరిచామని జగన్ వివరించారు. అమ్మఒడి ప్రారంభించిన మొదటి ఏడాదిలో హాజరు నిబంధనకు మినహాయింపునిచ్చామన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా అప్పుడు కూడా హాజరు నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో 51 వేల మందికి హాజరు నిబంధన కారణంగానే పథకాన్ని అందించలేకపోతున్నామన్నారు. 44,47,402 తల్లులకు గానూ.. 43,96,402 తల్లులకు అంటే 98.86 శాతం మంది తల్లులకు అమ్మఒడి ఇస్తున్నామన్నారు. 51 వేల మందికి లబ్ధి చేకూర్చలేకపోవడం బాధగానే ఉందని సీఎం అన్నారు. అమ్మఒడిని పటిష్టంగా అమలు చేయాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఈ మేరకు తల్లులు బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించారు. ఇక స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహించడానికి, స్కూళ్లలో మౌలిక సదుపాయాల నిర్వహణకు మరికొంత మినహాయిస్తున్నట్లు వివరించారు.

  ఇది చదవండి: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?


  అమ్మఒడి వంటి మంచి పథకాన్ని విమర్శిస్తున్నవారు అప్పట్లో పిల్లల్ని చదివించే తల్లికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మాది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మేనిఫెస్టోలోని 95శాతం హామీలు అమలు చేసేవాళ్లమా..? అనేది అలోచించుకోవాలన్నారు. ఎగ్గొట్టే నైజమే ఉంటే ఇలాంటి పథకం అమలు చేయాలన్న ఆలోచనే చేసేవాళ్లం కాదన్నారు. రాష్ట్రంలో పేద పిల్లలకు సాంకేతికతతో కూడిన చదువు అందించేందుకు బైజూస్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. రూ.24వేల విలువైన యాప్ పేద పిల్లలకు ఉచితంగా వస్తోందన్నారు. అలాగే 8వ తరగతిలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి రూ.12వేలు విలువైన ట్యాబ్ ను అందిస్తామన్నారు. అంతటి మంచి పథకాలను అందిస్తుంటే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో డిజిటల్ విద్యనందించేందుకు ప్రతి క్లాస్ రూమ్ లో టీవీలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు