ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప!ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూల్చిన ఆలయాలకు భూమి పూజ చేశారు. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దేవాదాయశాఖ.., సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ చేపడుతున్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో వివిధ కారణాల వల్ల కూల్చివేసిన, అభివృద్ధికి నోచుకోని 40 దేవాలయాలను ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది.
శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎంకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు ఇవే..!
దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులు..!
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమీషనర్ అర్జునరావు, జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, రక్షణ నిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Botsa satyanarayana, Hindu Temples, Kodali Nani, Vallabaneni Vamsi, Vellampalli srinivas, Vijayawada Kanaka Durga