YS Jagan Review: యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్... కాలేజీల్లో ఇకపై జాబ్ గ్యారెంటీ కోర్సులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నైపుణ్యాభివృద్ధిపై (Skill Development) సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (Skill Development And Training) పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు (Poly Technic), ఐటీఐలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ, విశాఖపట్నం (Visakhapatnam) లో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, తిరుపతిలో (Tirupati) స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌యూనివర్శిటీలు రూపొందిస్తాయని వివరించారు. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌సదుపాయం కల్పించడంద్వారా వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ ను బలోపేతం చేస్తున్నామని జగన్ తెలిపారు. :

  పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విశాఖపట్నంలో హై ఎండ్‌స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలన్నారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అందరికీ ఉచిత దర్శనం..


  ఇక ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న సీఎం.., పాఠ్యాంశాలను అప్‌ గ్రేడ్‌ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఐటీ ఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలన్నారు. దీనివల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. టెన్త్‌ లోపు డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పొందిన వారి డేటాను పంపించాలని తద్వారా... 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  ఇది చదవండి: కళ్ల ముందే నేషనల్ హైవే... కానీ వారు రోడ్డెక్కలేరు.. కారణం ఇదే..!


  డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, మోటార్లు, సోలార్‌ యూనిట్లు.. ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలా వరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. పారిశుద్ధ్యంకోసం వినియోగిస్తున్న పరికరాలను నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందన్నారు. నైపుణ్యంలేని మానవవనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడంలేదన్నారు. ఇలా నిత్యజీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవనరులను అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఏర్పాటు చేయడం ద్వారా తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందన్నారు. ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనకూడా దృష్టిపెట్టాలన్న సీఎం.., ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికెషన్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు.

  ఈ సమావేశానికి ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published: