హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Review: ఏపీలో కొత్త తరహా పంటలకు ప్రోత్సాహం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

YS Jagan Review: ఏపీలో కొత్త తరహా పంటలకు ప్రోత్సాహం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష జరిపారు.

ఇంకా చదవండి ...

వ్యవసాయశాఖ (Agriculture)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy)సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్ (e-Cropping), వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకే (Raithu Bharosa Kendra)ల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకూ 421.7 మిల్లీమీటర్లు కురిసిందని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే ఖరీఫ్‌లో ఇవ్వాళ్టి వరకూ 76.65లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాల్లో సాగయ్యిందని వివరించారు. వర్షాలు బాగా కురుస్తున్నందున మిగిలిన చోట్లకూడా రైతులు వేగంగా పంటలు వేస్తున్నారని రైతులు సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్లకింద, వర్షాధార భూములలో వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదం.. టీటీడీ కీలక నిర్ణయం

వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్ష జరిపారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలన్నారు. డ్రైయిన్లు సహా ఇరత్రా పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని దీనికి తగిన కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దీనిపై దృష్టిపెట్టాలన్ని సూచించారు.వ్యవసాయ సలహామండళ్ల కారణంగా సత్ఫలితాలు ఇస్తున్నాయన్న అధికారులు.., మార్కెట్లో డిమాండ్‌లేని వంగడాలను నిరుత్సాహ పరచడానికి సలహామండళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.

ఇది చదవండి: నాసిరకంగా నాడు-నేడు పనులు.. విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తున్న కాసుల కక్కుర్తి

రైతు భరోసా కేంద్రాలు – సేవలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలన్నారు. నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థనుకూడా సిద్ధంచేయాలని చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) దీనికి వినియోగించుకోవాలన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం.., నేచురల్‌ ఫార్మింగ్‌విధానాలను డిస్‌ప్లే చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.

ఇది చదవండి: ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

వైయస్సార్‌ పొలంబడి

వైయస్సార్‌ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం సమీక్ష జరిపారు. పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలని చెప్పారు. 15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అగ్రికల్చర్‌ కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలని చెప్పారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌

ఆర్గానిక్‌వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆధేశించారు. ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్‌చేసి ఆక్కడ రైతులకు పొలంబడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్‌ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

First published: