Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM YS JAGAN LAUNCHED CAMPAIGNING FOR DISHA APP AT VIJAYAWADA FULL DETAILS HERE PRN GNT

Disha App: మహిళలకు 'దిశ'తో అభయం.. భరోసానిచ్చిన సీఎం జగన్

వైఎశ్ జగన్ (ఫైల్)

వైఎశ్ జగన్ (ఫైల్)

రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan)( అన్నారు. దిశ యాప్ (Disha App) కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లుగా ఉండాలన్నారు.

    రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్నిసీఎం జగన్ వివరించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.అనంతరం ఐదుగురు మహిళలతో వారి మొబైల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌ విధానంలో వీక్షించారు.

    ఈ సందర్భంగా దిశ యాప్‌ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి మహిళలకు వివరించారు. ఆపద వచ్చినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరించారు. అనంతరం దిశా యాప్ పై , డౌన్లోడ్ పై అవగాహన కలిగించే వాల్ పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు.


    ఇది చదవండి: ఏపీకి మహిళా ముఖ్యమంత్రి... జగన్ అలా అనడానికి కారణం ఇదే..


    దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సీఎం జగన్‌ సూచించారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని జగన్ అన్నారు. తాడేపల్లి సీతానగరం ఘాట్ వద్ద జరిగిన ఘటన తనను కలచివేసిందన్న సీఎం.., యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు.

    ఇది చదవండి: ఏపి ఇంటర్ ఫలితాల అప్ డేట్ ఇదే... ప్రభుత్వం కీలక నిర్ణయం...


    రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి,డిజిపి గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఏ ఆర్.అనురాధ,రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత,వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్నివెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని), మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP disha act, Disha App

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు