ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్... ఓ అంబులెన్స్‌కి ప్రత్యేకంగా దారిఇచ్చింది. జనరల్‌గా సీఎం కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుంటే... ఇతర వాహనాలన్నింటినీ ఆపేస్తుంటారు పోలీసులు. కానీ... అది అంబులెన్స్ కావడంతో... సీఎం కాన్వాయే దానికి అడ్డుతొలగి దారి ఇవ్వాల్సి వచ్చింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా... పులివెందులకు వెళ్లి... నివాళులు అర్పించిన వైఎస్ జగన్... అక్కడి నుంచి తిరిగివచ్చి... గన్నవరం విమానాశ్రయం చేరారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్ కూతపెట్టింది. అది గమనించిన సీఎం జగన్... కాన్వాయ్‌లో వాహనాలన్నీ పక్కకు పంపి... అంబులెన్స్‌కి దారి ఇచ్చేయమన్నారు. అంతే... ఒక్కసారిగా... రోడ్డుపై సగ భాగం పూర్తిగా దారి ఏర్పడింది. దాంతో... ఎలాంటి బ్రేకూ వెయ్యకుండా అంబులెన్స్ వేగంగా వెళ్లిపోయింది.

వైఎస్ జగన్ మంచి నిర్ణయం... అంబులెన్స్‌కి దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్

వైఎస్ జగన్ మంచి నిర్ణయం... అంబులెన్స్‌కి దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్
ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్... ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ దగ్గర్లో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఇలా సీఎం కాన్వాయే దారి ఇవ్వడం ఒకింత చర్చనీయాంశం అయ్యింది.
Published by:Krishna Kumar N
First published:September 02, 2020, 13:07 IST