హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: వ్యవసాయ మోటర్లకు మీటర్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఆ విషయం రైతులకు చెప్పాలని సూచన..

YS Jagan: వ్యవసాయ మోటర్లకు మీటర్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఆ విషయం రైతులకు చెప్పాలని సూచన..

AP CM YS Jagan

AP CM YS Jagan

YS Jagan: వ్యవసాయ మోటార్లుకు మీటర్లు బిగించే అంశంపై అధికారులకు సీఎం జగన్ (AP CM YS Jagan) కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.., వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పాలని సూచించారు.

ఇంకా చదవండి ...

వ్యవసాయ మోటార్లుకు మీటర్లు బిగించే అంశంపై అధికారులకు సీఎం జగన్ (AP CM YS Jagan) కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.., వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పాలని సూచించారు. దీనిపై రైతులకు లేఖలు రాయాలని.., రైతుపై ఒక్కపైసాకూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించాలన్నారు. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పిన సీఎం.., మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని.., నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పాలన్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంపై పూర్తిస్థాయి సమీక్ష చేశారు సీఎం జగన్. గడిచిన వేసవికాలంలో డిమాండ్, సప్లైపై గణాంకాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది మార్చిలో 1268.7 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 1123.7 కోట్లు, ఏప్రిల్‌ నెలలో 1047.8 మిలియన్‌ యూనిట్లకోసం రూ.1022.4 కోట్లు, మే నెలలో 739.72 మిలియన్‌ యూనిట్లకోసం రూ.832.92కోట్లు, జూన్‌నెలలో 936.22 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 745.75 కోట్లు, జులై 25 వరకూ 180.96 మిలియన్‌ యూనిట్ల కోసం రూ.125.95 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇది చదవండి: ఈడీ దాడులపై కొడాలి నాని రియాక్షన్.. దమ్ముంటే అరెస్ట్ చేయించాలని సవాల్..



ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత, ధర్మల్‌కేంద్రాలపై ప్రభావం తదితర అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు.. సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని అధికారులు వివరించారు. థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని.., దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలని.., దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చన్నారు. డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికను అనుసరించాలని సూచించారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని చెప్పిన జగన్.., కోల్‌ స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు కూడా చేయాలని సూచించారు. పోలవరం విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ పనులపైనా సీఎం సమీక్షించారు. పనులు మరింత వేగంగా ముందుగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇక జగనన్న కాలనీల్లో పనులను అధికారులు వివరించగా.., కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు