CM YS Jagan: మహిళా ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్‌న్యూస్

Andhra Pradesh: ఉద్యోగులు చెప్పుకుంటున్న సమస్యలపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా ఆయన మహిళా ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

news18-telugu
Updated: October 24, 2020, 8:12 AM IST
CM YS Jagan: మహిళా ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్‌న్యూస్
CM YS Jagan: మహిళా ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్‌న్యూస్ (File)
  • Share this:
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... దసరాకి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇచ్చిందా, ఇవ్వలేదా అనే డౌట్ తెరపైకి వచ్చింది. ఉద్యోగులకు ఇచ్చింది అని కొందరు... ఇవ్వలేదు అని కొందరు చెబుతున్నారు. ఇలా గందరగోళం ఏర్పడటంతో... ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకూ దసరా ఆదివారం వచ్చింది కాబట్టి... ఆ రోజు ఎలాగూ సెలవే కాబట్టి ప్రత్యేకంగా పండగ సెలవు లేదనుకున్నారు అందరూ. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న దసరా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా సోమవారం 26ను ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది. మరి తమకు కూడా అలా వర్తించేలా చెయ్యాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26ను ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటించింది. ఇది ఉద్యోగుల కోరికతో తీసుకున్న నిర్ణయమే. పండుగ ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని ఉద్యోగులు కోరారు. అందుకే ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సెలవు ఉంటుంది. ఆదివారం సెలవుతో పాటూ... మరో రోజు అదనపు సెలవు లభించినట్లే. అతే... మహిళా ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది కాబట్టి... మిగతా ఉద్యోగులు సోమవారం విధులకు రావాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు మేలైన నిర్ణయాలు:

కోవిడ్‌ కారణంగా రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్‌ జీతాలు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం వెల్లడించింది. దీంతో పాటు సీపీఎస్‌ అమలు, పీఆర్‌సీ విషయంలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపింది. తమ సమస్యల గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశామని అన్నారు.

కరోనా సోకితే ప్రత్యేక సెలవులు:
కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కోవిడ్ కారణంగా రెండు నెలల డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు ఇవ్వటానికి సీఎం అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు.

నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: October 24, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading