Good News: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. రాష్ట్రంలో ఆసరా పథకం రెండో విడత అమలు చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

Andhra Pradesh Welfare Scheme: ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు శుభార్త. ఇవాళ మహిళ ఖాతాల్లోకి సీఎం జగన్ డబ్బులు వేయనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో డబ్బులు వేయడానికి సిద్ధమయ్యారు.

  • Share this:
    YSR Asara: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)మరో పథకాన్ని (AP Government Schemens) అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా మహిళలకు అందించే వైఎస్‌ఆర్‌ ఆసరా (YSR Asara Scheme) రెండో విడత కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 7న ప్రకాశం జిల్లా (Prasakasham District) ఒంగోలులో జరగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేతులమీదుగా ప్రారంభం కానుంది. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల మందికి లబ్ది చేకూరేలా 6,792 కోట్ల రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో నేడు జమ చేయనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ బైపోల్ (Badvel By Election) నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కానీ, ఈ పథకం కొత్తది కాకపోవటంతో రెండో విడత కార్యక్రమం అమలుకు అనుమతి ఇచ్చినట్టు ఎన్నికల సంఘం వివరించింది. సీఎం జగన్ ఈ పథకం ద్వారా లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.

    ఇవాళ ఉదయం ఒంగోలులో సీఎం జగన్ ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.35కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీకి జగన్ చేరుకోనున్నారు. 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిమిషాల పాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11 గంటల 15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన, తర్వాత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. తరువాత 12.30కి వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు.

    ఇదీ చదవండి: నవరత్న ఆయిల్ అంత పని చేసిందా..? బాత్ రూమ్ పైప్ లైన్లోకి దూరిన పాము.. చివరికి ఏం జరిగిందంటే..?

    8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇదీ చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. 17 ఏళ్ల తరువాత సీన్ రిపీట్ అవుతుందా..?

    ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబర్ 11న రూ.6వేల 330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలోనే చెల్లించాలని భావించినా.. నిధులు కొరతతో అక్టోబర్ 7కి వాయిదా వేశారు. ఆ వాయిదాలను నేడు మహిళల ఖాతాల్లోకి వేయనున్నారు సీఎం జగన్.
    Published by:Nagesh Paina
    First published: