నేడు జగనన్న దీవెన పథకం ప్రారంభం... ఇవీ విశేషాలు...

Andhra Pradesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా... ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దానీ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: February 24, 2020, 5:23 AM IST
నేడు జగనన్న దీవెన పథకం ప్రారంభం... ఇవీ విశేషాలు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ నెల 24న అంటే సోమవారం (ఇవాళే) విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇది మామూలు పర్యటన కాదు. ఓ కీలక, ప్రధానమైన పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధించినది. అందువల్ల వైసీపీ వర్గాలు ఈ పర్యటనపై ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం టూర్ షెడ్యూల్ ఫైనలైజ్ చేసింది. ఆ ప్రకారం చూస్తే... సీఎం జగన్... ఉదయం 9.10 నుంచీ గుంటూరు... తాడేపల్లిలోని తన ఇంటి నుంచీ బయల్దేరతారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. అక్కడి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచీ హెలికాప్టర్‌లో విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి ఉదయం 11 గంటలకి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు వెళ్తారు. ముందుగా అక్కడి ఎగ్జిబిషన్ స్టాళ్లను చూస్తారు. తర్వాత వైఎస్ఆర్ జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. పథకం గురించి ప్రజలకు వివరిస్తారు. తర్వాత జగన్... మధ్యాహ్నం 12.25 నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. మధ్యాహ్నం 12.35కి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.45కి దిశ పోలీస్ స్టేషన్‌ నుంచీ అక్కడి పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌కి వెళ్తారు. అక్కడి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి... మధ్యాహ్నం 1 గంటకు విశాఖ నుంచీ గన్నవరం బయల్దేరతారు. సీఎం జగన్ తొలిసారిగా సీఎం హోదాలో విజయనగరం వెళ్తున్నారు. అందువల్ల ఆయన పర్యటనపై జిల్లాలో వైసీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

జగనన్న దీవెన ప్రత్యేకతలు ఇవీ : నవరత్నాల్లో భాగం ఈ పథకం. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మొదట్లో ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన అమలుకు ప్రతిపాదించినప్పటికీ, తరువాత దీనిని ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింప జేస్తున్నారు. అలా ఈ పథకాన్ని 11.87 లక్షల మందికి వర్తింపచేస్తున్నారు. తొలి విడత విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,140 కోట్లు జమ చేయనున్నారు. ఏడాదికి రెండుసార్లుగా ఈ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేస్తారు. 24న (సోమవారం) తొలివిడతగా 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500ల చొప్పున,... డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులు 10.47 లక్షల మందికి రూ.10,000ల చొప్పున చెల్లిస్తారు. 25 నుంచి జగనన్న విద్యా, వసతి దీవెన కార్డులను ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు ఇస్తారు. కాబట్టి... ఈ పథకం లబ్దిదారులు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలనీ, మిస్ కావద్దని ప్రభుత్వం కోరుతోంది.
First published: February 24, 2020, 5:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading