హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jangan Delhi tour: రేపు ఢిల్లీకి సీఎం జగన్..సాయంత్రం ప్రధానితో భేటీ.. అజెండా ఏంటంటే..?

CM Jangan Delhi tour: రేపు ఢిల్లీకి సీఎం జగన్..సాయంత్రం ప్రధానితో భేటీ.. అజెండా ఏంటంటే..?

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

CM Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు సాయంత్రం నేరుగా మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భేటీకి ప్రధాన అజెండా ఏంటంటే..?

ఇంకా చదవండి ...

CM Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వెళ్లిన రోజు సాయంత్రమే నేరుగా ప్రధాని మోదీ (Prime minster Modi)తో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ భేటికి సంబంధించి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీని కలిసి ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)కి అపాయింట్ విషయంలో అప్పుడే క్లారిటీ ఇచ్చినట్టు టాక్. అయితే ఈ భేటీలో ప్రధాని మోదీ- సీఎం జగన్ మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ముందుగా ఏపీలో కొత్త జిల్లాల (AP New District ) ఏర్పాటు.. మంత్రి వర్గ విస్తరణపై ప్రధాని మోదీకి పూర్తి వివరాలు అందించనున్నట్టు సమాచారం. ఆ తరువాత.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులను అప్పుల రూపంలోనైనా ఇప్పించాలని కోరనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు రావాల్సిన నిధులపైనే అధికంగా చర్చించనున్నట్టు సమాచారం.

విభజన హామీలను కూడా ప్రధాని దగ్గర సీఎం జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. అలాగే పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పి.. మూడు రాజధానులకు సహకారం అందించాలని కోరనున్నట్టు ఢిల్లీ వర్గాల టాక్. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. కొత్త పొత్తులు.. అన్ని విషయాలపైనా వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి : ఏపీ మంత్రి వర్గ విస్తరణలో అదే ట్విస్ట్.. ఏ విధంగా ఎంపిక చేస్తున్నారంటే..?

ముఖ్యంగా ఏపీలో వచ్చే ఎన్నికల సమయానికి జనసేన-బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబును నమ్మొద్దని.. జాతీయ స్థాయిలో రాజకీయ పరంగా ఎలాంటి సమస్య ఎదురైనా.. తాము సహకరిస్తామని ప్రధానికి జగన్ హమీ ఇచ్చే అవకాశం ఉందని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ-పవన్ లను చంద్రబాబుకు దూరం చేయగలిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని.. అది చంద్రబాబుకు ఇబ్బంది కలడంతో పాటు.. మరోసారి వైసీపీ భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంటుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం ఉంది..

ఇదీ చదవండి : ఏపీలో కొత్త జిల్లాలతో ఆ రెండు జంటలకు లక్కీఛాన్స్.. ఉమ్మడి జిల్లాకు అధికారులుగా భార్య భర్తలు

మరోవైపు ఏపీలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా ఉంది. అప్పులు రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీయడం తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రాలు ఇలా అప్పులు పెంచుకుంటూ పోతే.. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్టే భారత దేశంలోనూ ఇబ్బంది తప్పదని.. భారత్ లోని బ్యూరోక్రాట్లు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రాత్రి ప్రధానమంత్రి మోదీ..ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ముఖ్య్గంగా కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాల పేరుతో భారీగా అప్పులు చేస్తున్నాయని.. ఆ ప్రభావం దేపైనా పడుతుందని హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయం కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ సైతం అక్కడే ఉన్నట్టు టాక్.. ఈ నేపత్యంలో ప్రధాని మోదీని సీఎం జగన్ భేటీ.. రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi

ఉత్తమ కథలు