హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP CM Jagan: నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. విపక్షాల విమర్శలకు కౌంటర్

AP CM Jagan: నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. విపక్షాల విమర్శలకు కౌంటర్

వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

Andhra Pradesh CM Jagan: గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయారు అని చంద్రబాబు చేసిన విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలనుకున్నారో.. లేక వరద ప్రభావం తగ్గింది ఈ సమయంలో వెళ్లినా పెద్దగా సహాయ చర్యలకు ఇబ్బంది ఉండదని భావించారో.. సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనకు ఈ రోజు వెళ్తున్నారు. ఆయన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే..

ఇంకా చదవండి ...

Andhra Pradesh Floods: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం వరద రాజకీయాలు కూడా ఉత్కంఠంగా మారియి. ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వరదతో ప్రజలు ఇబ్బంది పడుతుంటూ.. సీఎం గాల్లో వచ్చి గాల్లో వెళ్లిపోయారు అంటూ విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు విమర్శలకు అసెంబ్ల వేదికగానే సీఎం జగన్  మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కౌంటర్ ఇచ్చారు. తాను ఆ పరిస్థితుల్లో వరద ప్రాంతాలకు వెళ్తే.. సహాయ చర్యల్లో ఉన్న అధికారులు తన పర్యటన ఏర్పాట్లపై ఫోకస్ చేస్తారని.. అది సహాయ చర్యలకు ఇబ్బంది కలిగిస్తుందని అందుకే వెళ్లలేదన్నారు. అయితే వెనక్కు తగ్గని చంద్రబాబు తరువాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ వర్మ(CS Sameer Varma) కు లేఖ రాశారు.. వదర చర్యలపై న్యాయ విచరాణ కోరారు. ఏపీలో వరద (AP Floods) కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఎక్స్ గ్రాషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపక్షాలు విమర్శల సంగతి ఎలా ఉన్నా.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. భారీ వరదలతో ఎంతో మంది గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఇవాళ, రేపు వరద ప్రభావిత జిల్లాలైన కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తారు.

మొదటి రోజు కడప, చిత్తూరు జిల్లాలలో సీఎం జగన్ పర్యటిస్తారు. బాధిత ప్రజలు, రైతులతో ఆయన నేరుగా ఇంటరాక్ట్‌ కానున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై సీఎం స్వయంగా మాట్లాడుతారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటించనున్నారు. ఇక రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను దగ్గరుండి పరిశీలించనున్నారు. ఇటీవల కేంద్రం సభ్యులకు వరద పరిస్థితి పూర్తిగా వివరించిన సీఎం జగన్.. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాత ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి..

ఇదీ చదవండి : సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన దర్శకేంద్రుడు.. ఆలోచించండి అంటూ సంచలన ట్వీట్

నేటి షెడ్యూల్ ఇదే..

ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు సీఎం జగన్ బయలుదేరుతారు. 10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి (రాజంపేట) చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు. అటు నుంచి పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. సహాయశిబిరంలో ఉన్న బాధితులతో నేరుగా సీఎం మాట్లాడుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి.. గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా కాలినడకన పర్యటిస్తారు. ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళతారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు.

ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?

మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష ముగిసిన వెంటనే మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు. 4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుంటారు. పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళతారు సీఎం జగన్. వరద నష్టంపై బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం తిరుపతిలో పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

ఇదీ చదవండి : ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

డిసెంబరు 3న సీఎం పర్యటన..

డిసెంబరు 3 వ తేదీన చిత్తూరు, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. డిసెంబరు 3వ తేదీన ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్ధానికులతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా బయలుదేరి వెళతారు. నెల్లూరు రూరల్, దేవరపాలెం చేరుకుని, అక్కడ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డును, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను సీఎం పరిశీలించనున్నారు. తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి వెళ్లనున్నారు. పెన్నానదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్ధ పరిధిలో భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకుంటారు. వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శి్స్తారు. మధ్యాహ్నం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరిగి 4.20 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Floods, AP News, Heavy Rains

ఉత్తమ కథలు