హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News : నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జ‌గ‌న్ టూర్.. విద్యాదీవెన నిధుల విడుదల

AP News : నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జ‌గ‌న్ టూర్.. విద్యాదీవెన నిధుల విడుదల

సీఎం జగన్ (File Photo)

సీఎం జగన్ (File Photo)

AP News : పథకాలు ప్రకటించడం.. బటన్ నొక్కి నిధులను విడుదల చెయ్యడంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మరో పథకానికి నిధులు విడుదల చేయబోతున్నారు. అందుకోసం అన్నమయ్య జిల్లాలో పర్యటించబోతున్నారు. టూర్ షెడ్యూ్ల్ ఇదీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YS Jagan Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 30న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పర్యటించబోతున్నారు. అన్నయమ్య జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం జగన్ ఆ జిల్లాకు వెళ్లనుండటం ఇదే మొదటిసారి. టూర్ షెడ్యూల్ గమనిస్తే.. ఉదయం 9 గంటలకు సీఎం జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 9.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కి వెళ్తారు. తర్వాత హెలికాప్టర్‌లో ఉదయం 11.10కి మదనపల్లి బీటీ కాలేజీకి వెళ్తారు. 11.30కి అక్కడి టిప్పుసుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు వెళ్తారు. ఇలా టూర్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు.

నిధుల విడుదల :

ఈ పర్యటనలో సీఎం జగన్ .. విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.45కి మదనపల్లె నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10కి తాడేపల్లికి వెళ్తారు.

Viral Video : బైక్‌పై వెళ్లారు.. ఐదుగురు అరెస్ట్ అయ్యారు.. కారణం ఇదే

జిల్లాలపై ఫోకస్:

ఇదివరకు ఇలాంటి పథకాలకు నిధులు విడుదల చేసేటప్పుడు సీఎం జగన్ తన ఆఫీస్ నుంచే విడుదల చేసేవారు. ఐతే.. ప్రజల్లో ఉండేందుకు వీలైన అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్న ఆయన.. పథకాల నిధుల విడుదల విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అసలే ముందస్తు ఎన్నికలు రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే.. అంత మంచిదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

ఇప్పటికే గడప గడపకూ వైసీపీ పేరుతో.. మంత్రులూ, ఎమ్మెల్యేలను ప్రజల చెంతకు చేర్చుతున్న సీఎం జగన్.. తన వంతుగా తాను కూడా ఇలా నిధుల విడుదల కోసం ప్రజల్లోకి వచ్చి.. ప్రభుత్వం ఏం చేస్తోందో వివరించడం ద్వారా.. ప్రజలకు అవగాహన కల్పించాలని చూస్తున్నారు. అలాగే 175 నియోజక వర్గాల్లోనూ విజయం సాధించే వ్యూహంలో భాగంగానే ఆయన అన్ని జిల్లాలనూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Telugu news

ఉత్తమ కథలు