Home /News /andhra-pradesh /

Disha Police Station : నేడు ఏపీలో 18 దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు...

Disha Police Station : నేడు ఏపీలో 18 దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు...

Disha Police Station : రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం...

Disha Police Station : రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం...

Disha Police Station : అత్యాచార కేసులకు సంబంధించి ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... తాజాగా 18 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించబోతోంది. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం.

    Disha Police Station : మహిళల రక్షణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తోంది. నిజానికి ఈ పీఎస్... నిన్ననే ప్రారంభం కావాల్సి ఉంది. ప్రత్యేక కారణాల వల్ల ఇవాళ ఓపెన్ అవుతోంది. ఉదయం 10.30 గంటలకు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి... మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటన్నింటినీ జగన్... రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. వీటిలో ఓ పోలీస్ స్టేషన్‌ను ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించబోతున్నారు. అందువల్ల ఈ పోలీస్ స్టేషన్లన్నీ ఇవాళ్టి నుంచే సేవలు అందిస్తారు.



    ఇదే సమయంలో... అసెంబ్లీలో ఆమోదం పొంది... కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్న దిశ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఐతే... కేంద్రం... ఈ చట్టంలోని కొన్ని అంశాలపై మరింత వివరణ కోరడంతో... ఆ వివరాల్ని కూడా కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వస్తే... అత్యాచార కేసుల్లో 21 రోజుల్లో దర్యాప్తు పూర్తై... దోషులకు శిక్ష కూడా అమలవుతుందని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది.

    మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళలకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రవేశపెడతామని సుచరిత చెప్పారు. దీని ద్వారా ఆపదలో ఉన్న మహిళలు వెంటనే రక్షణ పొందేందుకు వీలవుతుందని పోలీసులు తెలిపారు.

    రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి... నన్నయ యూనివర్శిటీకి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన దిశ వర్క్‌షాప్‌‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దిశ పోలీస్ స్టేషన్ల ప్రాధాన్యం, అసలే రాష్ట్రం అప్పుల్లో ఉన్న సమయంలో... ఇలా అదనంగా ఈ పోలీస్ స్టేషన్లను ఎందుకు తేవాల్సి వస్తోందో సీఎం జగన్ వివరిస్తారు. అలాగే దిశ చట్టం పరిస్థితేంటి? ఎప్పటిలోగా అమల్లోకి వస్తుంది? దాని కోసం ఢిల్లీ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదీ జగన్ వివరించే అవకాశాలున్నా్యి. మొత్తంగా దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్న సమయంలో... ఏపీలో మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుండటంపై హర్షం వ్యక్తం అవుతోంది.


    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Andhra Pradesh, AP disha act, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు