ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం... విద్యార్థులకు గుడ్ న్యూస్

Andhra Pradesh : ఇదివరకు ప్రభుత్వాలు ఏ పథకాలు తెచ్చినా... వాటి వివరాలు ప్రజలకు పూర్తిగా తెలిసేవి కావు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా వల్ల క్లియర్‌గా తెలుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ కొత్త నిర్ణయమేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: March 11, 2020, 5:52 AM IST
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం... విద్యార్థులకు గుడ్ న్యూస్
సీఎం వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... విద్యార్థుల చదువులపై సమీక్షించారు. ఆ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యమైనవిగా ఉండాలని చెప్పారు. స్కూళ్లు తెరిచేటప్పటికి అవి పంపిణీ చెయ్యడానికి రెడీగా ఉండాలన్నారు. స్కూళ్లలో నాడు-నేడు అనే కార్యక్రమంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి తొలి విడతలో 15715 స్కూళ్లలో పనులు వేగంగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. నెక్ట్స్ మీటింగ్ సమయానికి అన్నీ పూర్తవ్వాలనీ, ఏవైనా పెండింగ్ ఉంటే... ఆ మీటింగ్‌లో తనకు చెప్పాలని అన్నారు. ఏం చేసినా జూన్ లోపే పూర్తవ్వాలన్నారు. జూన్‌లో స్కూళ్లు తెరవగానే విద్యార్థులు ఫుల్ హ్యాపీ అయ్యేలా చెయ్యాలన్నారు. మధ్యాహ్న భోజనం అదిరిపోవాలనీ, స్కూళ్లలో టాయిలెట్లు చూస్తేనే వావ్ అనిపించేలా ఉండాలనీ చెప్పారు. ఈ సమయంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన గోరు ముద్ద యాప్ సీఎం జగన్‌కి గుర్తొచ్చింది. అది సరిగా పనిచేస్తోందా మూలపడిందా అని సీఎం అడిగారు. "అయ్యో భలేవాళ్లు సార్... అది బాగా పనిచేస్తోంది" అని అధికారులు చెప్పారు. మంచిది... మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏ బిల్లులూ పెండింగ్ పెట్టకండి. పెడితే... విద్యార్థులకు నాణ్యత తగ్గించే ప్రమాదం ఉంది అని సీఎం జగన్ చెప్పారు.

అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష


ఇకపై ప్రతీ స్కూలుకూ స్మార్ట్ టీవీ ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆ స్మార్ట్ టీవీతో విద్యార్థులకు డిజిటల్ బోధన కల్పించాలన్నారు. సరిగ్గా జూన్‌లో స్కూళ్లు తెరవగానే జగనన్న విద్యా కానుక ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు. ఈ జగనన్న విద్యాకానుక ఏంటి అన్న డౌట్ మనకు రావచ్చు. ఇదో కొత్త స్కీం. ఇందులో భాగంగా... విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్ట్స్ బుక్స్ ఇస్తారు. ఇవన్నీ విడివిడిగా కాకుండా ఓ కిట్ లాగా ఉంటాయి.

జగనన్న విద్యా కానుకపై చర్చ రాగానే... అధికారులు... "సార్... మనం ఇవ్వాలనుకున్న యూనిఫామ్స్, బెల్టు, బ్యాగ్ ఇలా ఉంటాయి... ఇవి మీకు నచ్చాయిగా" అని అధికారులు అడగ్గానే... సీఎం జగన్... "ఈ నమూనాలు చూడ్డానికి బాగానే ఉన్నాయి... కానీ విద్యార్థులకు ఇచ్చేవి కూడా ఇలా నాణ్యమైనవే ఇవ్వాలి... అప్పుడు మనం కరెక్టుగా ఇచ్చినట్లు" అని అన్నట్లు తెలిసింది. ఇలా అన్ని విషయాలూ మాట్లాడిన సీఎం జగన్... నెక్ట్స్ మీటింగ్‌ నాటికి అన్నీ పూర్తి చేసుకొని రమ్మని అధికారులకు సూచించారు. అధికారులు... ఓకే సార్ అని కాన్ఫిడెన్స్‌తో చెప్పారు.

ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులూ... ఏపీలో జూన్ రాగానే... ఈ జగనన్న విద్యా కానుక తప్పనిసరిగా అందుకునేలా చేసుకోవాలి. ఇందుకు సంబంధించి విద్యార్థుల స్కూళ్లలో టీచర్లతో ప్రస్తావించాలి. విద్యా కానుక మీ పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చేలా వాళ్లను ముందుగానే ప్రిపేర్ చెయ్యాలి. తద్వారా వాళ్లు కూడా ప్రభుత్వం వాటిని ఎప్పుడు ఇస్తుందా అని అలర్ట్‌‍గా ఉండి... విద్యార్థులకు వాటిని అందిస్తారు.
First published: March 11, 2020, 5:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading