Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY TO DAY WILL GO TIRUMALA HE RELEASED VIDYA DIVENA FUNDS NGS TPT

CM Jagan: విద్యార్థుల ఖాతాల్లోకి 709 కోట్లు.. చిన్న పిల్ల ఆస్పత్రి శం శంఖుస్థాప‌న.. నేడు తిరుపతిలో సీఎం బిజీ బిజీ

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పలు కార్యక్రమాలతో బిజీ బిజీ కానున్నారు. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు. అలాగే శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇంకా చదవండి ...
    CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇవాళ తిరుపతి (Tirupati)లో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాని (Tirumala Tiruapti Devasthanam) కి చెందిన వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాలు, శంఖుస్థాప‌న చేయనున్నారు. ఇప్పటికే సీఎం ప‌ర్య‌ట‌న కోసం టీటీడీ (TTD) ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి (Padmavati children s Super Specialty Hospital  ) నిర్మాణానికి సీఎం జగన్ (CM Jagan) శంఖుస్థాప‌న చేయనున్నారు. అలిపిరి (Alipiri) దగ్గర 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుప‌త్రి నిర్మించనున్నారు. శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి శంఖుస్థాప‌న చేయనున్నారు. ఇందులో ఏడు అంతస్తులు, 350 పడకలు ఉంటాయి. ఈ ఆసుప‌త్రిలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. అత్యంత ఖరీదైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఇలాంటి ఆసుప‌త్రి దేశంలోనే మొద‌టిది కాబోతుంది.

    వీటితో పాటు.. బ‌ర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ వార్డులు కూడా సీఎం ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ ను హెల్త్ హబ్ గా మార్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. అందులో భాగంగానే.. మిష‌న్ హెల్త్ ఫ‌ర్ ఆల్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోంది. అలాగే పేద‌ల దగ్గరకే ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావ‌డానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం స్మైల్ ట్రైన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థతో క‌లిసి గ్ర‌హ‌ణ మొర్రి భాధితుల‌కు ఉచితంగా అధునాతన చికిత్స, వైద్య సేవ‌ల‌ను అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. చికిత్స అందించిన తర్వాత వీరికి స్పీచ్ థెరపీ, బీహేవియ‌ర‌ల్ కౌన్సెలింగ్ లాంటివి అందించనున్నారు.

    ఇదీ చదవండి : సహపంక్తి భోజనాలతో సిక్కోలులో ఫుల్ జోష్.. బాదుడే బాదుడులో జగన్ పై నిప్పులు

    తిరుపతికి చేరుకున్న దగ్గర నుంచి ఆయన బిజీగానే ఉండనున్నారు. శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ క్యాన్స‌ర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ (స్వీకార్‌) ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లక్షా 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ రోగులకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవ‌లు అందించనున్నారు.

    ఇదీ చదవండి : మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. హైదరాబాద్ లో రోడ్లపై వైసీపీ మీమ్స్

    దీంతో పాటు జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతిలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం రూ.10,994 కోట్ల సాయం అందించింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు