హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఆసక్తి పెంచుతున్న సీఎం జగన్ టూర్.. బిల్లు ఉపసంహరణ తరువాత నేడు తొలిసారి విశాఖకు

CM Jagan: ఆసక్తి పెంచుతున్న సీఎం జగన్ టూర్.. బిల్లు ఉపసంహరణ తరువాత నేడు తొలిసారి విశాఖకు

CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖకు వస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.

CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖకు వస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.

CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖకు వస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.

ఇంకా చదవండి ...

  P. Anand Mohan, Visakhapatnam, News18.                    Andhra Pradesh CM Jagan Mohan Reddy Vizag tour:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) ఇవాళ విశాఖపట్నం (Visakhapatnam) లో పర్యటించబోతున్నారు. సీఎం ఎప్పుడు వైజాగ్ వెళ్లడం సాధారణమే.. అయితే ఈ పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం రాజధాని అంశం. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి పలు ముహూర్తాలు కూడా పెట్టారు. ప్రియమైన స్వామి స్వరూపా ఆశీస్సులతో రాజధాని పనులు ముమ్మరం చేయాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే హైకోర్టు  (Hig hcourt) జోక్యంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారు. ఆ బిల్లు ఉపసంహరణ తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.

  సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్‌ సెంటర్, వైజాగ్‌ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు వద్ద ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ వెంకటరమణారెడ్డి, ఆర్‌డీవో పెంచల కిశోర్‌ పాల్గొన్నారు.

  ఇదీ చదవండి: సమంతపై మండిపడుతున్న భార్య బాధితుల సంఘం.. పుష్పలో పాట తొలగించాలని డిమాండ్

  సీఎం జగన్ టూర్ సాగేది ఇలా..

  విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల సీఎం జగన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయలుదేరనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు కు సీఎం హాజరవుతారు.

  ఇదీ చదవండి: ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై చర్చలు సఫలం.. ఆందోళన విరమణ

  సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్‌ దగ్గర ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను సీఎం జగన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనమవుతారు.

  ఇదీ చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ కలకలం.. సెంచరీకి చేరువలో కొత్త వేరియంట్ కేసులు

  సీఎం జగన్ తొలిసారి ఓ పాలనా పరమైన కార్యక్రమానికి  విశాఖ వస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు విశాఖ వచ్చినా.. శారద పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకోవడవమో. లేదా ఒడిశా, శ్రీకాకుళం వెళ్తూ విశాఖలో ఆగడమో తప్ప.. నేరుగా విశాఖ వచ్చిన సందర్భం లేదు. గతంలో ఓ సారి అనుకున్నా ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ సారి సీఎం జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. విశాఖ రాజధానిపై ఏం మాట్లాడుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు