హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Budget 2022: అచ్చెన్నాయుడిపై సీఎం సీరియస్.. వయసుకైనా గౌరవం ఇవ్వరా అని ప్రశ్న

AP Budget 2022: అచ్చెన్నాయుడిపై సీఎం సీరియస్.. వయసుకైనా గౌరవం ఇవ్వరా అని ప్రశ్న

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

AP Budget 2022: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు టీడీపీ వ్యవహరించిన తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షడితో మాట్లాడిన ఆయన సీరియస్ అయ్యారు.. పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు.. ఇంతకూ ఆయన ఏమన్నారో తెలుసా..?

ఇంకా చదవండి ...

AP Budget 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఆరంభంలోనే హీటెక్కాయి. తొలి రోజే సభలో రచ్చ రచ్చ అయ్యింది. నేరుగా తొలిసారి గవర్నర్ సభలో నేరుగా ప్రసంగిస్తుంటే.. అదే సమయంలో టీడీపీ (TDP) సభ్యులు నినాదాలు మొదలెట్టారు.. గవర్నర్ ప్రతులను చించడమే కాకుండా.. గవర్నర్ గో బ్యాక్ నినాదాలతో సభ దద్దరిల్లింది. ఆందోళన చేస్తున్నా.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లారు. అయితే తరవాత జరిగిన బీఏసీ సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CMJagan Mohan Reddy) ప్రస్తావించారు. గవర్నర్‌ను దూషిస్తూ, గవర్నర్‌ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు (Tachnnaidu)పై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. గవర్నర్ మీ పార్టీ.. మా పార్టీ కాదని గుర్తు చేశారు. ఇతరుల విషయంలో ఎలా ఉన్నా.. వయసులో అంత పెద్ద ఆయన గవర్నర్‌ విషయంలో అలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు. మరోవైపు ఇదే సమావేశంలో 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు..

అంటే మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం దివంగత గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అలాగే ఈ నెల 9, 12, 13, 18, 19, 20 తేదీల్లో సభకి సెలవులు ప్రకటించారు. తరువాత ఈ నెల 10న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 11న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. ఈ నెల 16, 17, 21, 22, 23, 24న బడ్జెట్ డిమాండ్ లపై చర్చించనున్నారు. ఈ నెల 25న ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి తొలి రోజే హీటెక్కిన అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ వాకౌట్..

అయితే అసెంబ్లీలో 25 అంశాలపై చర్చించాలని బీఏసీలో వైసీపీ కోరింది. జిల్లాల విభజన, ప్రత్యేక హోదా-విభజన హామీలు,పోలవరం ప్రాజెక్ట్-గత ప్రభుత్వం తప్పిదాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, శాంతిభద్రతలు-ప్రభుత్వం, ప్రతిపక్షాల పాత్ర, అవినీతి నిర్మూలనతో పాటు మొత్తం 25 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ కోరింది.

ఇదీ చదవండి: భగ్గుమంటున్న వంట నూనెల ధరలు.. లీటర్ ధర ఎంతంటే..?

అంతకుముందు సభలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. సభ ప్రారంభమై గవర్నర్‌ ప్రసంగం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. వారి నినాదాలు, ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్‌ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. అక్కడ టీడీపీ నేతల ప్రవర్తనపై సీఎం జగన్ సైతం సీరియస్ అయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan

ఉత్తమ కథలు