CM Jagan on Health Clinick: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో హెల్త్ హబ్స్ (heath Hub)ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశం మొత్తం గర్వించేలా.. మన రాష్ట్రంలో అత్యాధునిక వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పూర్తి సదుపాయాలతో ఆస్పత్రులను నెలకొల్పాలని నిర్దేశించారు. మెడికల్ కళాశాలలు (Medical Colleges), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానలను సరైన సమయంలో పూర్తి చేయాలన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. నాడు-నేడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగు సహా ప్రాధాన్య కార్యక్రమాలపై చర్చించారు.
వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగా.. ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) నాడు-నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని.. డిసెంబర్ నాటికి మరమ్మతుల పనులు పూర్తవుతాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం జరుగుతోందని.. వచ్చే ఏడాది మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు.
ఇదీ చదవండి : ఏపీలో మందుబాబులకు షాక్.. కొత్త ఉత్తర్వులతో మద్యం ప్రియుల పరేషాన్
16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలు పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాల, విశాఖ జిల్లా (Visakha District)లోని అనకాపల్లి మెడికల్ కళాశాలల నిర్మాణ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలైనట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశించారు. 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి : అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ఆగర్భ శత్రువుల ఆలింగనం
క్యాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చామని.. దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో భాగంగా.. ఇంతకుముందు పరీక్షలు చేయించుకోనివారు ఉంటే వారికి వెంటనే పరీక్షలు చేయించాలని సీఎం సూచించారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించాలన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని.. ఇందుకోసం వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.
డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్నారు అధికారులు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. సీహెచ్సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయని సీఎం కు వివరించారు. అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామని అధికారులు చెబితే.. మిగిలిన పనులు కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
ఇదీ చదవండి : అనంతపురం మరోసారి తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల ప్రాణాలతో ఆటలా అంటూ లోకేష్ ఫైర్
హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్స్ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించామన్నారు. జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు హెల్త్ హబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి : టార్గెట్ 2024.. కలుస్తున్న టీడీపీ-జనసేన..! సెట్ చేస్తున్న బీజేపీ సీనియర్…?
వ్యాక్సినేషన్ పైనా అధికారులు వివరణ ఇచ్చారు. సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు ఇప్పటి వరకు 1,17,71,458 మంది ఉన్నారన్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 మంది ఉన్నారు. మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 మంది. మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 వాడమని అధికారులు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Kurnool