ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY REVIEW ON EDUCATION AND HE SAID SUPPURATE COLLEGES FOR WOMENS NGS
AP CM Jagan: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు.. 8వ తరగతి నుంచి ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం
సీఎం జగన్ (ఫైల్)
AP CM Jagan: విద్యాశాఖలో సమూల మార్పులపై సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే నాడు నేడుతో పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఆయన.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై అమ్మాయిలకు ప్రత్యేక కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 8వ తరగతి నుంచి ఈ విద్యాసంవత్సరం నుండే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. విద్యా శాఖలో ప్రక్షాళణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు (Nadu Nedu)తో పాటు పలు కీలక సంస్కరణలను ముందుకు తెచ్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియం (English Medium)ను తప్పని సరి చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మరో అడుగు ముందుకు వెశారు. ఇకపై ఇంగ్లీష్ మీడియం ఈ ఏడాది జూన్ లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి తప్పని సరి అయ్యేలా సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా శాఖపైన సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు - నేడు రెండో దశ వేగం పెరగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండోదశ కింద దాదాపు 25వేల స్కూళ్లలో పనులు చేపట్టినట్లు అధికారులకు ఆయనకు వివరణ ఇచ్చారు. అలాగే రెండోదశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు ఈ ఏడాది కనిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సీఎం చెప్పారు. నాడు - నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే నాడు - నేడు రెండోదశ ఖర్చు అంచనా సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
2022-23 విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రారంభించాలని.. దానికి సంబంధిచి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా అమ్మాయిలకు ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు (Jagananna Vidya Kanuka) అంతా సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్ధులకు విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని సీఏం ఆదేశించారు.
నాడు–నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు ప్రారంభించాలి అన్నారు. అలాగే ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు.. సీఎం వీటిలో అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తిచేశామన్నారు అధికారులు. కొద్ది దశలవారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ కొనసాగాలన్నారు సీఎం. 2022 జులై, 2023 జులై, 2024 జులై... ఇలా దశలవారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలన్నారు. దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.
ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో చూడాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంగ్లీషు పదాల ఉచ్ఛారణపై యాప్‌ను టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లి దండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. రక్షణ కోసం దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించడంతో పాటు వారికి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.