Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY MEETING END WITH GOVERNMENT EMPLOYEES THESE ARE THE PROMISES NGS

CM Jagan: ప్రాక్టికల్ గా ఆలోచించండి.. మెరుగైన పీఆర్సీ ఇస్తాం.. ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

CM Jagan: ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ ఇచ్చారు సీఎం జగన్.. మీరు చెప్పిన అంశాలన్నీ సానుకూలంగా పరిశీలీస్తున్నామన్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు ఆలోచించండి.. మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి దీనిపై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

ఇంకా చదవండి ...
    Employees meeting with CM Jagan:  ఏపీ ప్రభుత్వ (AP Government) ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు చెప్పిన అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని.. ఉద్యోగులకు ఏదైనా మంచి చేయాలనే తపన తనకు ఉంది అని వారికి జగన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రా ఆర్ధిక పరిస్థితి అన్ని తెలిసినవారిగా.. ప్రాక్టికల్ గా ఆలోచించాలని సూచించారు. మీరు అలా ఆలోచించండి.. మేము మీకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. తాను ఉద్యోగస్తుల కుటుంబంలో ఒకడిని.. ఆదే నమ్మకంతో మీకు భరోసా ఇస్తున్నాను అన్నారు.  పీఆర్సీ (PRC)పై రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఉద్యోగులు చెప్పిన ఇతర అంశాలపై చర్చించి.. తగిన విధంగా సమస్యలు పరిష్కరిస్తామని.. ఉద్యోగులంతా ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉండాలని సీఎం జగన్ కోరారు..

    జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో తాడేపల్లిలోని క్యాంప్‌ఆఫీస్‌లో సుదీర్ఘంగా చర్చించారు సీఎం జగన్. సమావేశమయ్యారు జగన్. తాను ఉద్యోగుల్లో ఒక కుటుంబ సభ్యుడిగానే ఆలోచిస్తున్నాను అన్నారు. మనసా, వాచా మీ అందరికీ మంచి చేయాలనే తపనతోనే ఉన్నాని ఉద్యోగ సంఘాల (Employees Union) నేతలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మీరు చెప్పిన అన్ని సమస్యలపై ఓ నోట్ తయారు చేసుకుని.. మీకు మంచి జరిగేలా చూస్తూ.. 2, 3 రోజుల తర్వాత మరోసారి సమాశం నిర్వహిస్తానని.. ఆ సమావేశంలోనే PRCపై తుది ప్రకటన చేస్తాను అంటూ స్పష్టంగా చెప్పారు. మీరు చెప్పిన అన్ని సమస్యలను స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని చెప్పారు. వీలైనంతగా మంచి చేయాలన్న తపనతో ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పరోక్షంగా ఆర్థిక పరిస్థితిని తెలియచేశారు. మీరంతా ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. ఈ ప్రభుత్వం మనది అని గుర్తొంచుకుని.. మోయలేని భారాన్ని మోపకుండా… అందరూ కాస్త ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు అందరిలో సానుకూల దృక్పథం ఉండేలా చూడాల్సిన బాధ్యత మీదే అన్నారు CM జగన్.

    ఇదీ చదవండి: ఏపీలో కొత్త ర‌కం పురుగు టెన్షన్! రైతులకు నిద్ర కరువు

    అయితే గత రెండు నెలులుగా ఆంధ్రప్రదేశ్ లో PRC పంచాయితీ నడుస్తోంది. అశుతోష్‌ మిశ్రా నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు చాలా రోజులు పట్టుబట్టాయి. కానీ పలుమార్లు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినా లాభం లేకపోయింది. దీంతో తపని సరి పరిస్థితుల్లో పోరుబాట పట్టాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు. తిరుపతిలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వరకు వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలిపాయి. తిరుపతి సీఎం జగన్ హామీ ఇవ్వడం.. ఆ తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా JACలతో చర్చలు జరిపారు. దీంతో తమ ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నామని ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు..

    ఇదీ చదవండి: వార్నింగ్ ఇస్తారా..? బుజ్జగిస్తారా..? చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

    అయితే ఈలోపే సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. 14.29 ఫిట్‌మెంట్ ఇవ్వాలని సూచించింది. కానీ దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తుంట్.. ఫిట్‌మెంట్‌ని 14.29గా ఎలా సూచిస్తారంటూ మండిపడ్డాయి. ఆ తర్వాత కూడా పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ప్రభుత్వం. అయితే ఫైనల్‌గా 40 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత ఇవ్వడం సాధ్యం కాదంటోంది ప్రభుత్వం. 14 నుంచి 27 శాతం మధ్యలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదీ ఏమైనా దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు