ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY LETTER TO CNETRAL GOVERNMENT ON ALL INDIA SERVICE RULES NGS GNT
CM Jagan Letter: మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఎవరని పంపాలన్న నిర్ణయం మాదేనంటూ కేంద్రానికి సీఎం లేఖ
వైఎస్ జగన్ (ఫైల్)
AP CM Jagan Letter to PM Modi: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు.. రాష్ట్రాల అవసరాలను కేంద్రం గుర్తించాలన్నారు.. ఈ సవరణలను పరిగణలోకి తీసుకుంటే.. కేంద్రానికి రాష్ట్రం అన్ని విధాల అండగా ఉంటుందని లేఖలో సూచనల చేశారు..
CM Jagan Letter: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్ (IAS) అధికారుల్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం (AP Government) స్వాగతించింది. పాలనను సజావుగా, నిరాటకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులు ఉండాల్సిందేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారుల్ని కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్ పై పిలిపించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్వీసు నిబంధనల్ని సవరించాలన్న ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆయన ప్రధాని మోదీ (PM Modi)ని కోరారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లో సవరణలను ఓ వైపు స్వాగతిస్తూనే.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సమర్థవంతమైన అధికారులు వస్తారని భావిస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వంలో సమర్థవంతమైన అధికారులుంటే రాష్ట్రాలకే మేలే జరుగుతుందని అభిప్రాయంతో ఏకీభవించారు. కానీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లో కొన్ని సవరణలతో ఇబ్బందులు వచ్చే అవకాశముందని ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించారు.
సర్వీస్‌లో ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై పంపేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు సీఎం జగన్. అయితే వెంటనే డిప్యూటేషన్‌పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు సీఎం జగన్. సమర్థులైన అధికారులకు కీలక ప్రాజెక్టుల బాధ్యతలను అప్పగిస్తుంటామని, అలాంటి అధికారిని ఆకస్మికంగా డిప్యూటేషన్‌పై తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. తక్షణ బదిలీలతో అధికారుల కుటుంబం, పిల్లల చదువులపై ప్రభావం పడుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. CM Jagan Letter
డిప్యూటేషన్‌పై ఆలిండియా సర్వీస్ అధికారులను పంపే విషయంలో ప్రస్తుతం రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతినే కొనసాగించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కోరారు. రాష్ట్రాలు ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే అధికారులను తీసుకునే పద్ధతిని కొనసాగించాలని ప్రధానిని జగన్ కోరారు.
తాను సూచించిన అంశాల ఆధారంగా ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి అంటూ లేఖలో కోరారు జగన్. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వుకు అవసరమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని తాను హామీ ఇస్తున్నాను అన్నారు. ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్ నిబంధనల్ని కేంద్రం ఏ ఉద్దేశంతో మార్చాలనుకుందో తాను అర్థం చేసుకున్నాను అని లేఖలో చెప్పారు. కానీ కేంద్రం ఎవరిని కోరితే వారిని తక్షణం పంపాలన్ననిబంధనపై పునరాలోచించాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని వేసే అడుడులోనూ ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు మీకుంటుందని హామీ ఇస్తున్నాను అంటూ లేఖలో రాశారు సీఎం పేర్కాన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.