ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY LAUNCHES 144 OXYGEN PLANS IN AP HE SAID READY TO FACE THIRD WAVE NGS
AP CM Jagan: థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్..
ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ను కరోనా మళ్లీ భయపెడుతోంది. థర్డ్ వేవ్ ఎంట్రీ అయ్యిందనే అనుమానం పెరుగుతోంది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు సీఎం జగన్.. ఇందులో భాగంగా ఏపీలో కృత్రిమ ప్రాణవాయువును అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు.
AP CM Jagana launches Oxygen plants: ప్రస్తుతం భారత దేశాన్ని గడగడ వణికిస్తోంది కరోనా వైరస్(Corona Virsu).. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కూడా విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే నైట్ కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని వీకెండ్ లాక్ డౌన్ కు ఆదేశాలు ఇచ్చాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) ప్రభుత్వం సైతం థర్డ్ వేవ్ (Third Wave) పై పోరాటానికి సిద్ధమైంది.. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముందస్తు చర్యలను ఇప్పటికే ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య వేయి దాటడం ఆందోళన కరిగించే పరిస్థితే.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారీగా కేసులు నమోదైనా..ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలపై ఫోకస్ చేశారు. గత అనుభవాలను గుర్తించి.. ఈసారి మెడికల్ ఆక్సిజన్ విషయంలో ఎలాంటి సమస్య రాకూడాదని నిర్ణయించారు. ఇందులో భాగంగా యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 144 మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటిని ముఖ్యమంత్రి ఇవాళ వర్చువల్ పద్ధతిలో తాడేపల్లి నుంచి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒమైక్రాన్ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు.
ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 20కోట్ల రూపాయల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు కొనుగోలు చేశామన్నారు సీఎం జగన్. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్లైన్ల సౌకర్యం కల్పించనున్నామన్నారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మొత్తం163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ వైరల్(వీఆర్డీఎల్) ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు సీఎం జగన్. ఇప్పటికే 80 శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగామన్నారు. 82 శాతం వ్యాక్సినేషన్‌తో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 సార్లు డోర్ టూ డోర్ సర్వే చేశామని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్.. భవిష్యత్తులో మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రభుత్వం 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్లైన్లు సౌకర్యం కల్పిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.