ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY LAUNCHED YSR EBC NESTHAM HE STARTED IN VIRTUAL NGS
YSR EBC Nestham: మహిళల ఖాతాలో రూ.589 కోట్లు.. హామీ ఇవ్వకపోయినా అండగా నిలిచానన్న జగన్
వైఎస్ జగన్ (ఫైల్)
YSR EBC Nestham: మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. ఎక్కడా హామీ ఇవ్వలేదు.. అయితే అగ్రవర్ణ మహిళలకు అండగా నిలుస్తున్నాను అన్నారు సీఎం జగన్.. అగ్రవర్ణంలో పేద మహిళలను అవస్తలను గుర్తించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించామని.. మహిళల ఖాతాల్లోకి 589 రూపాయల నగదు జమచేస్తున్నాను అన్నారు సీఎం జగన్.
YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరో కొత్త పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi), వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR Pension Kanuka), వైఎస్సార్ ఆసరా (YSR Asara), వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత (YSR Cheyutha), వైఎస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham), ఉచిత ఇళ్ళ పట్టాల వంటి పథకాలను మహిళల పేరుతో అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని.. మహిళల పేరుతో ప్రారంభించింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వర్చువల్ విధానంలో బటన్ నొక్కి మహిళ ఖాతలాల్లో 589 కోట్ల రూపాయల నగదు జమ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు..
మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. ఏ ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. అయినా మహిళ కష్టాలను అర్థం చేసుకున్న ఒక అన్నగా తాను ఈ పతకానికి శ్రీకారం చుట్టాను అన్నారు సీఎం జగన్.. రాష్ట్రంలో అగ్రవర్ణంలో ఉన్న పేదల ఇబ్బందులు కూడా గుర్తించాని అందుకే ఈ పథకంలో చెల్లమ్మలకు అండగా నిలడబడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు 3,92,674 మంది పేద అక్క చెల్లెమ్మలకు రూ. 589 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నానని అన్నారు.
అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపు 4 లక్షలమందికి ప్రతిఏటా 15 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు సీఎం జగన్. 32 నుంచి 33 లక్షల మంది మంది అక్కచెల్లెమ్మలు మేలు చేస్తున్నామని గుర్తు చేశారు. అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మేలు. డ్వాక్రా మహిళలను గత ప్రభుత్వం మోసం చేసిందని.. దీంతో సంఘాల పరపతి దారుణంగా పడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. కోటి 25 లక్షల మందికి మేలు జరిగే గొప్ప కార్యక్రమం.
మహిళా సాధికారితకు రాజకీయంగా కూడా తమ ప్రభుత్వం ప్రామఖ్యత ఇచ్చింది అన్నారు. శాసనమండలిలో తొలి మహిళా వైస్ ఛైర్మ న్గా సోదరిగా జకియా ఖాన్ఉంది అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రి సుచరితమ్మ ఉందన్నారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని పెట్టామన్నారు. తొలి మహిళా ఎన్నికల అధికారిగా కూడా ఆమె ఉన్నారని గుర్తు చేశారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51శాతం ఇచ్చామన్నారు సీఎం జగన్..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.