హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Birthday: ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ఎమ్మెల్యే రోజా సర్‌ప్రైజ్ గిఫ్ట్

CM Jagan Birthday: ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ఎమ్మెల్యే రోజా సర్‌ప్రైజ్ గిఫ్ట్

CM Jagan Birthday: ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. తమ అధినేత.. అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా అభిమానాన్ని పలువురు వినూత్నంగా చాటుకున్నారు. వెండి నాణెంపై, రావి ఆకుపై, కోడి గుడ్డుపై, విభిన్న పూలతో సీఎం జగన్‌ రూపాన్ని చిత్రీకరించి ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే రోజా మాత్రం ఆయనకు చిరకాలం గుర్తు ఉండేలా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు.

ఇంకా చదవండి ...

  CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ (Andhra praeesh) వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు (CM Jagan Mohan Reddy Birth day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు (YCP leaders), కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుక పార్టీ నేతలే కాదు ప్రజలందరికీ పర్వదినం వంటిదని వేడుకలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా (Social Media)లో ఎక్కడ చూసినా.. జగన్ బర్త్ డే విషెస్ తో ట్రెండింగ్ గా మారుతోంది. ఈరోజు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskarreddy) వినూత్న రీతిలో చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలోని గోశాల ముందు ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రాన్ని రూపొందించారు. అయితే ఎమ్మెల్యే రోజా (Mla Roja) కూడా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు.

  జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరూ ఊహించని గిఫ్ట్ ప్లాన్ చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు రోజా.. ఆ చిన్నారి పుష్ప ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో 89 శాతం మార్కులతో సత్తా చాటింది. ఇప్పుడు అంతకుమించి అనేలా ఈ ఏడాది ప్లాన్ చేశారు.. 

  తన నగరి నియోజకర్గంలోని ముస్లిం గ్రామం అయిన మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పుట్టిన రోజు గిఫ్ట్ లో భాగంగా తాను ఈ పని చేస్తున్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే బర్త్ డే లోపు మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా నిర్ణయించుకున్నారు.

  ఇదీ చదవండి : ఆ మంత్రి మాటకు విలువ లేదా..? సొంత నియోజకవర్గంలో పెత్తనం వేరేవాళ్లదేనా..?

  అంతేకాకుండా కరోనాతో చనిపోయిన మ‌ృతుల కుటుంబాలకు దుస్తులు, సరుకులు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా బాధిత కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, MLA Roja

  ఉత్తమ కథలు