హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan on Corona: కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్.. పక్కా ప్రణాళికతో వెళ్లాలన్న సీఎం జగన్

CM Jagan on Corona: కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్.. పక్కా ప్రణాళికతో వెళ్లాలన్న సీఎం జగన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

CM Jagan on Corona: బాబోయ్ కరోనా.. మళ్లీ వదిలేలా లేదుగా.. ఇప్పటికే చైనానా గజగజ వణికిస్తున్న కొత్త వేరియంట్.. భారత్ ను కూడా భయపెట్టనుందా.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు సూచిస్తోంది కేంద్రం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అలర్ట్ అయ్యింది.. పక్కా ప్రణాళికతో కరోనాకు కళ్లె వెయ్యాలి అన్నారు సీఎం జగన్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

CM Jagan on Corona: కరోనా (Corona) మళ్లీ కన్నీళ్లు పెట్టేంచుందుకు సై అంటోంది.. ఇప్పటికే రెండున్నరేళ్ల పాటు ప్రపంచం మొత్తాన్ని గజ గజలాడించింది. ఇప్పుడు మరో వేవ్ ముంచుకొస్తోంది అనే హెచ్చరికలు భయపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్టాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక లోక్‌సభలో కేంద్రమంత్రి (Central Minister) మాండవీయ కీలక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్‌ BF-7పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ కచ్చితంగా వాడేలా (Mask Must) రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అలర్ట్ అయింది. అన్ని జాగ్రత్తలతో ముందస్తు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఆర్టీపీసీఆర్ (RTPCR) ల్యాబ్ లలో పరీక్షలు చేసేందుకు నిర్ణయించింది. అంతే కాకుండా విజయవాడ (Vijayawada) లో జినోమ్ సెక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేసింది. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లో10 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచనుంది. అన్ని జిల్లాల్లో కలిపి 34,763 ఆక్సిజన్ బెడ్లు, 8594 ఐసీయూ బెడ్లు,12,292 సాధారణ బెడ్లను అరేంజ్ చేసింది. పెడియాట్రిక్ ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేసింది.

ఫోర్త్ వేవ్ అంటూ ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండాలని సూచించారు.. రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకపోయినా.. ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదని అధికారులకు సూచించారు.

మరోవైపు గత 50 రోజుల్లో 30 వేల శ్యాంపిల్స్ లో 130 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కరోనా రక్కసి మరోసారి భారత్‌లోనూ పంజా విసురుతోంది. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో రెండు కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 కేసులు గుర్తించారు. చైనా ప్రకంపనలతో భారత్‌లో హై ఎలర్ట్‌ ప్రకటించారు. భారత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మాస్కులు ధరించాలనీ, బూస్టర్‌ డోసు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండి : కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి తానే కారణమన్న చంద్రబాబు .. మరోసారి ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి : పెను సంచలనం.. పౌర సరఫరాల సంస్థలో వంద కోట్ల స్కాం.. మహిళా ఆర్డీవో అరెస్టు

లక్షణాలు ఏంటి..?

బీఎఫ్ –7 వైరస్‌ బారిన పడిన వారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్, జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి, కండరాల నొప్పి, మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ వ్యాధి సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పక ధరించాలి. అందరూ బూస్టర్ డోస్‌లు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిశుభ్రతను పాటించాలి. బలమైన ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Corona alert, Corona casess

ఉత్తమ కథలు