Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOCUS ON BC COMMUNITY SO THEY COMMUNITY LEADER GET MORE CHANCE NGS

AP Cabinet Reshuffle: ఏపీ మంత్రి వర్గ విస్తరణలో అదే ట్విస్ట్.. ఏ విధంగా ఎంపిక చేస్తున్నారంటే..?

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి మండలి కొలువదీరేందుకు సమయం దగ్గర పడింది. ఈ నెల ఏడవ తేదీనే.. ప్రస్తుత మంత్రులు చివరి కేబినెట్ భేటీ జరగనుంది. ఆ వెంటనే మంత్రులతో వన్ టు వన్ సమావేశమై.. వారి మనసులో మాట కూడా తెలుసుకోనున్నారు. తాజాగా మంత్రుల ఎంపిక విషయంలో అధినేత జగన్ దాన్నే ప్రమాణికంగా తీసుకున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
  AP Cabinet Reshuffle:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) ముహూర్తం దగ్గర పడుతోంది. మరో మూడు రోజుల్లోనే మంత్రులుగా ఎవరుంటారు.. ఎవరు పదవులు కోల్పోతారనే దానిపై స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) క్లారిటీ ఇవ్వనున్నారు.  మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వస్తోంది.  ఒకరిద్దర్ని కూడా ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది.. ఇలా అన్ని విషయాల్లో మంత్రులకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఏ అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలి.. ప్రతిపక్షాలను ఎదుర్కొనాలి.. ఇలా అన్ని విషయాల్లోనే మాజీలు అవుతున్న మంత్రులకు.. కొత్తగా ఎంపిక అవుతున్న మంత్రులకు ఆయనే స్వయంగా  దిశా నిర్దేశం చేయనున్నారు.

  ఈ మంత్రి వర్గ విస్తరణ అన్నది.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారన్నదానిపై పూర్తి క్లారిటీ వచ్చినట్టే. ఆ దిశగానే మంత్రి వర్గ కూర్పు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారందరినీ తప్పించబోతున్నారని, వారి స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది.

  ఇదీ చదవండి : సైన్స్ కు అందని అద్భుతం.. ఉగాది రోజు సంధ్య వేళ స్వామివారికి సూర్యకిరణాలతో అభిషేకం

  2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణ ఎవరు ఊహించని విధంగానే ఉంది. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కులాల ఆధారంగా మంత్రులకు పదవులను కట్టబెట్టారు. దీనికోసం తనకు అత్యంత సన్నిహితులైన వారిని సైతం అధినేత పక్కన పెట్టారు. ఎలాంటి మొహమాటానికి పోలేదు. తొలి సారి తమను పక్కన పెట్టిన అధినేత రెండో విడత తప్పక అవకాశం ఇస్తారని భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సారి జనగ్ మనసులో లెక్కలు వేరే ఉన్నాయని ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఈ విస్తరణ చేపడుతున్నట్టు సమాచారం.

  ఇదీ చదవండి: శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది.. పవన్ మరో ఆసక్తికర ట్వీట్..? ఎవరిని ఉద్దేశించి

  ముఖ్యంగా టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంటారని భావిస్తున్న సామాజిక వర్గాలనే జగన్ దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త మంత్రివర్గంలో దాదాపు 10 మంది వరకు బీసీ మంత్రులు ఉండబోతున్నారని టాక్. బీసీ సామాజిక వర్గం ఎక్కువ టీడీపీ వైపు మొదటి నుంచి ఉన్నా..  2019 ఎన్నికల్లో చీలిక ఏర్పడి.. ఓ వర్గం  వైసీపీ వైపు నిలబడినా, పూర్తిస్థాయిలో వారి అండదండలు వైసీపీకి ఉండాలనే ఉద్దేశంతో బీసీల ప్రాధాన్యాన్ని జగన్ పెంచాలని చూస్తున్నారని టాక్.  వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి కొత్త మంత్రివర్గంలో చోటు ఇస్తారని తెలుస్తోంది.

  ఇదీ చదవండి: మేకకు తాళి కట్టిన యువకుడు.. ఎందుకో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..?

  ఇక మైనారిటీలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూనే మొత్తం పంతొమ్మిది మంది వరకు ఉండే అవకాశం ఉందని కొంతమంది వైసీపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం పెంచే క్రమంలో సొంత సామాజిక వర్గానికి చెందిన తనకు అత్యంత సన్నిహితులైన వారిని జగన్ పక్కన పెడుతూ ఉండడం పై ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు