Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY CONVOY GAVE WAY TO 108 AMBULANCE NGS

CM Jagan Convoy: మరోసారి మనసు టచ్ చేసిన సీఎం.. కాన్వాయ్ మధ్యలో 108కు దారిచ్చిన జగన్

సీఎం జగన్ కాన్వాయ్ (ఫైల్)

సీఎం జగన్ కాన్వాయ్ (ఫైల్)

CM Jagan Convoy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి మనసును టచ్ చేశారు.. స్పీడ్ గా అత్యంత భద్రత మధ్య జగన్ కాన్వాయ్ వెళ్తోంది. అదే సమయంలో కుయ్ కుయ్ మంటూ 108 వాహనం వస్తోంది. వెంటనే ఆయన అధికారులను ఆదేశించి ఏం చెప్పారో తెలుసా..?

ఇంకా చదవండి ...
    CM Jagan convoy 108 vehicle: ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాధారణంగా మంత్రులు, లేదా వీఐపీలు అటు వైపు వెళ్తున్నారంటే.. సాధారణ వాహనదారులకు. అంబులెన్స్ లకు కష్టాలు తప్పవు. వారు వెళ్లినంత వరకు ట్రాఫిక్ ను క్లియర్ చేయరు అధికారులు. దీంతో నిమిషాల తరబడి రోడ్లపై ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రొటోకాల్ కష్టాలు తప్పడం లేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో గొప్ప మనసు చాటుకుంటున్నారు. అత్యవసర పని మీద వెళ్తున్నా.. ఆయనకు కుయ్ కుయ్ మనే శబ్ధం వినిపించింది అంటే చాలు కాన్వాయ్ ను ఆపేస్తారు. ముందు 108 వాహనాన్ని పంపించండి అని అధికారులకు సూచిస్తారు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా సీఎం కాన్యాయ్ మధ్యలో నుంచి 108 అంబులెన్స్ వాహనాన్ని పంపారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపారు. సీఎం  ఢిల్లీ (Delhi) వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి  (Gannavaram Airport )వస్తున్నారు. అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ (Vijayawada) వైపు వెళ్లేందుకు 108 వాహనం వచ్చింది. దాన్ని గమనించిన సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.

    108 వాహనాన్ని ఆపొద్దని.. వెంటనే దానికి ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు అలాంటి సందర్భాల్లో తన ఆదేశాల వరకు ఎదురు చూడవద్దని.. అంబులెన్స్ ముందు వెళ్లడం ముఖ్యం అంటూ పోలీసులకు స్పష్టం చేశారు. అయితే అప్పటికే సీఎం జగన్ కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు ఆపారు. కానీ అదే సమయంలో 108 సౌండ్ వినిపించడంతో.. సీఎం ఆదేశాల మేరకు.. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు. 108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్ అయింది. సీఎం కాన్వాయ్ మధ్యలో ఆపి పోలీసులు 108 వాహనాన్ని పంపారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరారు.

    ఇదీ చదవండి : మారిన ఏపీ కేబినెట్ భేటీ షెడ్యూల్.. 11నే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. కాబోయే కొత్త మంత్రులు వీరే..?

    ప్రస్తుతం సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు కూడా.. సాయంత్రం 4:30కి ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి సమస్యలు, పెండింగ్ నిధులు, ఆర్థిక సాయం, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల అంశాన్ని చర్చించనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్రానికి వైసీపీ మద్దతుపైనా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత 6 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ సమావేశం కానున్నారు. రేపు గజేంద్ర సింగ్ షేకావత్ సహా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఏపీ పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి కేంద్ర సహకారంపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించనున్నారు.

    ఇదీ చదవండి : ఇంకా దొరకని మత్యకారుల ఆచూకీ.. ఆరుగురి అదృశ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన

    అయితే అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్తున్నప్పుడు.. తరువాత గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. రాజ్‌భవన్ నుంచి బయటకు వెళ్తుండగా.. అంబులెన్స్ శబ్దం వినిపించింది. దీంతో అంబులెన్స్ వెళ్లిన తర్వాతే కాన్వాయ్‌లో బయల్దేరి వెళ్లారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: 108 ambulence, Andhra Pradesh, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు