హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP CM Jagan Birthday: ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు

AP CM Jagan Birthday: ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు

ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

AP CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతల కేరింతలమధ్య ఆయన భారీ కేక్ కట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి సహా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

AP CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మంత్రులు.. ఇతర పార్టీ కీలక నేతలు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రులు, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు వేద పండితులు ఆయన్ను వేధమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తూ ఆయన్ను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు, సీఎస్‌, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. కేవలం తాడేపల్లిలోనూ కాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.. నేతలంతా సీఎం కు బర్త్ డే విసెష్ చెప్పడంలో పోటీ పడుతున్నారు. కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ వినూత్నంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా సైతం మారు మోగుతోంది. అభిమానులు, కార్యకర్తలు అయితే రెండు రోజుల నుంచి టీట్లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.


తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (pm narendra modi) సైతం ట్వీట్టర్ ద్వారా సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్ చేశారు.


ఏపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని సైతం సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.. పేద ప్రజలు, రాష్ట్రం కోసం నిత్యం శ్రమించే జగన్ నిండి నూరేళ్లు చల్లగా.. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పరిమళ్ నత్వానీ శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.

ఇదీ చదవండి : ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ఎమ్మెల్యే రోజా సర్‌ప్రైజ్ గిఫ్ట్

అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chiranjeevi, Pm modi